Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kajal Aggarwal: రీ ఎంట్రీలోనూ దిమ్మతిరిగే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న చందమామ

ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించింది ఈ భామ. ఆ తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మగధీర సినిమాతో స్టార్ డమ్ అందుకుంది.

Kajal Aggarwal: రీ ఎంట్రీలోనూ దిమ్మతిరిగే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న చందమామ
Kajal
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 31, 2022 | 7:24 PM

అందాల చందమామ కాజల్ ప్రస్తుతం సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. లక్ష్మీకళ్యాణం సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఇక ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించింది ఈ భామ. ఆ తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మగధీర సినిమాతో స్టార్ డమ్ అందుకుంది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా మారింది. డార్లింగ్‌, బృందావనం, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌, బిజినెస్‌ మెన్‌, టెంపర్‌, ఖైదీ నంబర్‌ 150 తదితర ఎన్నో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సినిమాల్లో నటించి టాప్‌ హీరోయిన్‌గా క్రేజ్‌ సొంతం చేసుకుంది. హీరోయిన్‌గా బిజీ కెరీర్‌ కొనసాగుతున్న క్రమంలోనే 2020లో వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లూతో కలిసి ఏడడుగులు నడిచింది. తమ దాంపత్య బంధానికి గుర్తుగా ఈ ఏడాది ఏప్రిల్‌లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబుకి నీల్‌ కిచ్లూ అని నామకరణం కూడా చేసింది. ప్రస్తుతం మాతృత్వపు మాధుర్యంలో తేలియాడుతోన్న ఈ అందాల తార తన కుమారుడి ఫొటోలు ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంటోంది.

ఇక పెళ్లి తర్వాత సినిమాలు గ్యాప్ ఇచ్చింది కాజల్. ఇక ఇప్పుడు తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. అయితే ఆమె ప్రస్తుతం వెబ్ సిరీస్ ల్లో నటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే కాజల్ రీ ఎంట్రీలోనూ రెమ్యునరేషన్ అదే రేంజ్ లో డిమాండ్ చేస్తుందని తెలుస్తోంది. గతంలో ఒకొక్క సినిమాకు 3 కోట్లు వసూల్ చేసింది ఈ బ్యూటీ.

ఇవి కూడా చదవండి

ఇక ఇప్పుడు కూడా అదే రెమ్యునరేషన్ ను కంటిన్యూ చేయనుందట. కాజల్ ఒక్కో సినిమాకు 3 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. సీనియర్ హీరోలకు జోడీగా కాజల్ అగర్వాల్ కు ప్రస్తుతం వరుస ఆఫర్లు వస్తున్నాయని టాక్. పెళ్లి తర్వాత గ్లామర్ రోల్స్ కు కాజల్ అగర్వాల్ దూరంగా ఉంటున్నారు.

12 ఏళ్లకే గిన్నిస్‌ రికార్డ్.. బాపట్ల బుడ్డోడి ట్యాలెంట్‌ చూడండి!
12 ఏళ్లకే గిన్నిస్‌ రికార్డ్.. బాపట్ల బుడ్డోడి ట్యాలెంట్‌ చూడండి!
స్వీట్ షాప్ స్టైల్‌లో రసమలైని ఇంట్లోనే చేసుకోండి.. రెసిపీ మీ కోసం
స్వీట్ షాప్ స్టైల్‌లో రసమలైని ఇంట్లోనే చేసుకోండి.. రెసిపీ మీ కోసం
కుర్రాళ్ళ గుండెల్లో గిలిగింతలు పెడుతున్న యంగ్ బ్యూటీ
కుర్రాళ్ళ గుండెల్లో గిలిగింతలు పెడుతున్న యంగ్ బ్యూటీ
అమ్మకాల్లో ఐ ఫోన్స్ కొత్త రికార్డులు.. ఇక పాతవన్నీ దిగదుడుపే..!
అమ్మకాల్లో ఐ ఫోన్స్ కొత్త రికార్డులు.. ఇక పాతవన్నీ దిగదుడుపే..!
పోలీస్ స్టేషన్ గేటుకు బేడీలు ఏంటి సార్....
పోలీస్ స్టేషన్ గేటుకు బేడీలు ఏంటి సార్....
తులసి దగ్గర దీపం ఎందుకు వెలిగిస్తారో తెలుసా..?
తులసి దగ్గర దీపం ఎందుకు వెలిగిస్తారో తెలుసా..?
వేసవిలో గ్లాసుడు నీటిలో చిటికెడు ఉప్పు కలిపి తాగితే ఎన్ని లాభాలో
వేసవిలో గ్లాసుడు నీటిలో చిటికెడు ఉప్పు కలిపి తాగితే ఎన్ని లాభాలో
ఎందుకు మావ అంటే.. అదో రకమైన కిక్ అట...
ఎందుకు మావ అంటే.. అదో రకమైన కిక్ అట...
ప్లాస్టిక్ బాక్స్‌లో వేడి వేడి అన్నం నిల్వ చేసే అలవాటు మీకూ ఉందా?
ప్లాస్టిక్ బాక్స్‌లో వేడి వేడి అన్నం నిల్వ చేసే అలవాటు మీకూ ఉందా?
డ్రగ్స్ మత్తులో హీరోయిన్‌తో అసభ్యకరంగా ప్రవర్తించిన దసరా విలన్..
డ్రగ్స్ మత్తులో హీరోయిన్‌తో అసభ్యకరంగా ప్రవర్తించిన దసరా విలన్..