AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR-War2: ఎన్టీఆర్ రేంజ్ అలాంటిది మరి.. వార్ 2 సినిమాకు రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన చిత్రం 'వార్ 2'. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం (మే20) ఈ సినిమా టీజర్ రిలీజ్ కాగా, ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ సినిమా కోసం ఎన్టీఆర్ భారీ రెమ్యునరేషన్ తీసుకున్నాడని తెలుస్తోంది.

Jr NTR-War2: ఎన్టీఆర్ రేంజ్ అలాంటిది మరి.. వార్ 2 సినిమాకు రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?
Jr NTR, War2 movie
Basha Shek
|

Updated on: May 20, 2025 | 5:51 PM

Share

జూనియర్ ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న ‘వార్ 2’ సినిమా టీజర్ మంగళవారం విడుదలైంది. దీనికి అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా జూనియర్ ఎన్టీఆర్ తొలిసారిగా పూర్తి స్థాయి హిందీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. కాగా వార్ 2 టీజర్ తర్వాత ఎన్టీఆర్ ఒక్కసారిగా బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాడు. ఈ సినిమాలో హృతిక్ కి ఎన్టీఆర్ గట్టి పోటీ ఇచ్చినట్లు టీజర్ చూస్తేనే అర్థమవుతోంది. అంతే కాదు ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ పోషిస్తున్నాడని సమాచారం. ఈ క్రమంలోనే వార్ 2 సినిమాకు ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఇప్పుడు అటు బాలీవుడ్ లోనూ, ఇటు టాలీవుడ్ లోనూ ఆసక్తికర విషయంగా మారింది. వార్ 2 సినిమాకు ఎన్టీఆర్ ఏకంగా 60 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. బాలీవుడ్ లో ఒక సౌత్ హీరోకు ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ అందడం మామూలు విషయం కాదంటున్నారు బాలీవుడ్ క్రిటిక్స్. మరోవైపు ఇప్పుడు ఎన్టీఆర్ కు ఇండియాతో పాటు విదేశాల్లోనూ క్రేజ్ ఉందని, అలాంటప్పుడు 60 కోట్లు ఇవ్వడంలో ఏ మాత్రం తప్పులేదంటున్నారు తారక్ ఫ్యాన్స్.

వార్ 2 సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్నప్పటికీ, మొత్తం చిత్రీకరణ రోజులు 150 మాత్రమే. ఈ సినిమా చిత్రీకరణ కోసం చిత్ర బృందం ఆరు దేశాలు చుట్టేసింది. మన దేశంతో పాటు స్పెయిన్, ఇటలీ, అబుదాబి, జపాన్, రష్యాలో వార్ 2 సినిమాను చిత్రీకరించారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీ బడ్జెట్‌ను ఖర్చు పెట్టారు.ఈ సినిమాలోని యాక్షన్, డ్యాన్స్ సన్నివేశాలను విదేశాల్లో చిత్రీకరించారు. టీజర్ లో యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఇప్పటికే చూపించారు. అలాగే ఈ చిత్రంలో హాలీవుడ్ స్థాయి ఛేజింగ్ సన్నివేశాలు ఉంటాయని అర్థమవుతోంది. ఈ సినిమాలో హృతిక్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య డ్యాన్స్ లు, అదిరిపోయే ఫైట్స్ ఉంటాయని సమాచారం.

‘వార్’ సినిమా ఆరు సంవత్సరాల క్రితం వచ్చింది. ఆ సినిమాలో టైగర్ ష్రాఫ్, హృతిక్ రోషన్ నటించారు. ప్రస్తుతం హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ విలన్ లాంటి పాత్ర పోషిస్తున్నట్లు అనిపిస్తోంది. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల అవుతుంది. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. సినిమాలోని ఒకే ఒక నృత్య సన్నివేశం చిత్రీకరించాల్సి ఉంది. హృతిక్ గాయం కారణంగా షూటింగ్ ఆగిపోయింది. జూన్ చివరి నాటికి తిరిగి ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

వార్ 2 టీజర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..