Jr.NTR: క్యాన్సర్‌తో పోరాడుతున్న అభిమానికి ఎన్టీఆర్ వీడియో కాల్.. కౌశిక్ కళ్లల్లో ఆనందం చూశారా?
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా ఇదే కావడం, టీజర్లు, ట్రైలర్లు ఓ రేంజ్ లో ఉండడంతో అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకులు దేవర రాక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ (19) అనే కుర్రాడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఈ అబ్బాయి బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. తాను చనిపోయేలోపు 'దేవర' సినిమా చూడాలనుకుంటున్నానని, అప్పటివరకు తనను బతికించాలని డాక్టర్లని వేడుకుంటున్నాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా ఇదే కావడం, టీజర్లు, ట్రైలర్లు ఓ రేంజ్ లో ఉండడంతో అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకులు దేవర రాక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ (19) అనే కుర్రాడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఈ అబ్బాయి బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. తాను చనిపోయేలోపు ‘దేవర’ సినిమా చూడాలనుకుంటున్నానని, అప్పటివరకు తనను బతికించాలని డాక్టర్లని వేడుకుంటున్నాడు. దీనికి సంబంధించి వీడియో ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరలయ్యింది. కౌశిక్ తల్లిదండ్రులు కూడా తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ తమ పిల్లాడి ప్రస్తుత పరిస్థితి గురించి వివరించారు. తమ అబ్బాయిని బతికించాలంటూ ఈ సందర్భంగా పవన్ కల్యాణ్, ఎన్టీఆర్ లకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడీ విషయం తారక్ వరకు చేరింది. కౌశిక్ ఆరోగ్య పరిస్థితి, ‘దేవర’ చూడాలనుకోవడం తదితర విషయాలు ఎన్టీఆర్ వరకు వెళ్లగా.. స్వయంగా ఆయనే వీడియో కాల్ చేసి, తన వీరాభిమానితో మాట్లాడాడు.
‘నవ్వుతుంటే బాగున్నావ్’ అని ఎన్టీఆర్ అనడంతో.. మిమ్మల్ని ఇలా చూస్తానని అనుకోలేదని సదరు అభిమాని ఎమోషనల్ అయ్యాడు. ‘భలేవాడివి, నేను మాట్లడకపోతే ఎలా.. నువ్వు క్యాన్సర్ దాటి రావాలి, ‘దేవర’ సినిమా చూడాలి. సినిమాలు తర్వాత విషయం. ముందు నీ ఆరోగ్యం బాగుండాలి. త్వరగా కోలుకోవాలి’ అని తారక్ ఆకాంక్షించాడు. దీంతో ఒక్కసారైనా కలవాలని ఉందని అభిమాని కోరగా.. త్వరలోనే కచ్చితంగా కలుస్తానని ఎన్టీఆర్ హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
కౌశిక్ తో వీడియో కాల్ లో మాట్లాడుతోన్న ఎన్టీఆర్.. వీడియో ఇదిగో..
#NTR stands by his fan! ❤️
A fan who is battling cancer had one wish to have a conversation with @Tarak9999. NTR fulfilled his dream by speaking with him bringing him joy. pic.twitter.com/Xgt5l1Ii1H
— Eluru Sreenu (@IamEluruSreenu) September 14, 2024
త్వరలోనే కలుస్తాను.. ఎన్టీఆర్ భరోసా..
JrNTR @tarak9999 Anna Spoke With fan Koushik from Tirupati Who is Suffering from Cancer through a video Call ❤️❤️
నేను మాట్లాడకపోతే ఎట్లా నీతో! He is more than God to me ❤️❤️❤️❤️
Nuvvu TFI Ki oka Varam Swamy 🙏🧎#DevaraOnSep27th #DevaraStorm pic.twitter.com/Nqi9X3vDs7
— 𝙎𝙐𝙍𝙀𝙉𝘿𝙍𝘼 🅢💗🅝 (@Surendra646011) September 14, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.