Jr.NTR : వేట మొదలు.. ప్రశాంత్ నీల్ సినిమా కోసం బయలుదేరిన ఎన్టీఆర్.. పవర్ ఫుల్ లుక్లో తారక్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమాతో బిజీగా ఉన్నారు. మరోవైపు సోషల్ మీడియాలో తారక్ న్యూలుక్ గురించి విపరీతమైన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల అర్జున్ s/o వైజయంతి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తారక్ పూర్తిగా సన్నబడి కనిపించడంతో అసలు ఏం జరిగిందంటూ ఆందోళనకు గురయ్యారు ఫ్యాన్స్.

దేవర బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వార్ 2 సినిమాలో నటిస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బీటౌన్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో తారక్ రా ఏజెంట్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. కొన్ని నెలలుగా ఈ మూవీ చిత్రీకరణతో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. ఇప్పుడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి ఎన్టీఆర్ నీల్ అని వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఇటీవల కొద్ది రోజుల క్రితమే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయిందంటూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఇప్పుడు ఏప్రిల్ 22న ఈ మూవీ ప్రాజెక్టులో జాయిన్ కానున్నారు ఎన్టీఆర్.
ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం బయలుదేరాడు ఎన్టీఆర్. చూస్తుంటే ఈ సినిమా షెడ్యూల్ కోసమే ఎన్టీఆర్ మరింత స్లిమ్ అయినట్లుగా తెలుస్తోంది. నీల్ స్క్రిప్ట్ కోసమే తారక్ ఇంతగా రిస్క్ చేసి స్లిమ్ గా మారిపోయినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు వార్ 2 చిత్రీకరణతో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. కొన్ని రోజులు ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెకేషన్ వెళ్లారు. మరోవైపు వార్ 2 సినిమా షూటింగ్ పూర్తి కాగా.. ఒక సాంగ్ మాత్రమే ఉందని హృతిక్ రోషన్ క్లారిటీ ఇచ్చారు. ఇందులో హృతిక్, ఎన్టీఆర్ కలిసి డ్యాన్స్ చేయనున్నారని తెలియడంతో పాన్ ఇండియా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ప్రస్తుతం నీల్ ప్రాజెక్ట్ కోసం బయలుదేరిన ఎన్టీఆర్ ఫోటోస్, వీడియోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అందులో తారక్ పవర్ ఫుల్ లుక్ లో కనిపిస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ పై మరింత క్యూరియాసిటీ నెలకొంది. నీల్ సినిమా తర్వాత ఎన్టీఆర్ దేవర 2 చిత్రంలో నటించనున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రానున్న ఈసినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది.
THE HUNT BEGINS…🔥🔥
Man of Masses @tarak9999 sets off to join the shoot of #NTRNeel from April 22nd 💥💥
ABSOLUTE MAYHEM 🌋 #PrashanthNeel @MythriOfficial @NTRArtsOfficial @NTRNeelFilm @Tseries pic.twitter.com/nedtDCWGuz
— Mythri Movie Makers (@MythriOfficial) April 20, 2025
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..
