AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devara Movie: నా కోసం ఒక్కసారి కూడా అలా చేయలేదు.. జాన్వీపై ఎన్టీఆర్ కంప్లైంట్స్ మామూలుగా లేవుగా..

ఈ క్రమంలోనే బాలీవుడ్ గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షోలో దేవర టీమ్ సందడి చేసింది. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమో ఆద్యంతం ఫుల్ కామెడీగా సాగింది. తాజాగా విడుదలైన ప్రోమోలో తన ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ కోసం తన తల్లిదండ్రుల మధ్య జరిగే గొడవ గురించి చెప్పుకొచ్చింది జాన్వీ.

Devara Movie: నా కోసం ఒక్కసారి కూడా అలా చేయలేదు.. జాన్వీపై ఎన్టీఆర్ కంప్లైంట్స్ మామూలుగా లేవుగా..
Janhvi Kapoor, Jr.ntr
Rajitha Chanti
|

Updated on: Sep 26, 2024 | 1:01 PM

Share

మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘దేవర’ రేపు అడియన్స్ ముందుకు రాబోతుంది. ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినీప్రియుల నిరీక్షణకు తెరపడనుంది. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య ఈ మూవీ విడుదల కానుంది. ఈ క్రమంలో కొన్ని రోజులుగా దేవర చిత్రయూనిట్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ప్రాంతాల్లో ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ ముంబైలో వరుస ఇంటర్వ్యూలు, టీవీ షోలలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షోలో దేవర టీమ్ సందడి చేసింది. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమో ఆద్యంతం ఫుల్ కామెడీగా సాగింది. తాజాగా విడుదలైన ప్రోమోలో తన ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ కోసం తన తల్లిదండ్రుల మధ్య జరిగే గొడవ గురించి చెప్పుకొచ్చింది జాన్వీ.

ఉదయం తన తండ్రికి ఆలూ పరాటా తినే అలవాటు ఉంటుందని.. కానీ తన తల్లి కారణంగా ఇడ్లీ సాంబార్ తినడం అలవాటు చేసుకున్నాడని తెలిపింది. ఈ విషయంలో ఎప్పుడూ నార్త్ ఇండియన్ లా గొడవపడేదని అని చెప్పుకొచ్చింది. నార్త్ లో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరని ప్రశ్నించగా.. శ్రీదేవి అని ఠక్కున ఆన్సర్ ఇచ్చాడు తారక్. అలాగే జాన్వీ పై ఫన్నీగా కొన్ని కంప్లైయింట్స్ ఇచ్చాడు. దేవర షూటింగ్ కోసం జాన్వీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంటి భోజనం పంపించానని.. కానీ తాను ముంబై వచ్చినప్పుడు మాత్రం ఆమె ఒక్కసారి కూడా ఇంటి భోజనం పంపించలేదని అన్నారు. కనీసం హోటల్ ఫుడ్ కూడా ఆర్డర్ చేయలేదంటూ ఫన్నీగా చెప్పాడు తారక్. దీంతో జాన్వీతోపాటు అక్కడున్నవాళ్లంతా ఠక్కున నవ్వేశారు.

ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ఇదే. దాదాపు ఆరేళ్ల తర్వాత దేవర సినిమాతో సోలోగా రాబోతున్నాడు తారక్. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీతోనే జాన్వీ తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. భారీ అంచనాల మధ్య రూపొందించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. ఈ సినిమా సెప్టెంబర్ 27న తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో విడుదల కాబోతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.