Devara: ఎన్టీఆర్ క్రేజ్ అంటే ఇది.. హాలీవుడ్ అతిపెద్ద ఫిల్మ్ ఫెస్టివల్లో దేవర.. ఫ్యాన్స్ ఖుషీ..
తాజాగా తారక్ అభిమానుల్లో ఓ వార్త ఫుల్ జోష్ నింపుతుంది. హాలీవుడ్ లో జరగనున్న అతిపెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ లె దేవర మూవీని ప్రదర్శించబోతున్నారు. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 9 వరకు కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెలిస్‌లో అతిపెద్ద జానర్ ఫిల్మ్ ఫెస్టివల్ బియాండ్ ఫెస్ట్ 2024 జరగనుంది. ఈ ఫెస్ట్ లో ఈజిప్టియన్ థియేటర్లో సెప్టెంబర్ 26 సాయంత్రం దేవర మూవీని
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా దేవర. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు ఆరేళ్ల తర్వాత తారక్ సింగిల్‌గా అడియన్స్ ముందుకు రాబోతున్నారు. దీంతో దేవర చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా మొదటిసారి బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ చిత్రంలో తారక్ సరసన కనిపించనుంది. అలాగే బీటౌన్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనుండడం.. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవీచంద్రన్ అద్బుతమైన మ్యూజిక్ అందించడంతో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూడాలా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ క్రమంలో కొన్ని రోజులుగా చిత్రయూనిట్ వరుసగా ప్రమోషన్స్ నిర్వహిస్తుంది. ఇటీవలే ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించిన సంగతి తెలిసిందే. దేవర ట్రైలర్ ఒక్కసారిగా ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. తాజాగా తారక్ అభిమానుల్లో ఓ వార్త ఫుల్ జోష్ నింపుతుంది. హాలీవుడ్ లో జరగనున్న అతిపెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ లె దేవర మూవీని ప్రదర్శించబోతున్నారు. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 9 వరకు కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెలిస్‌లో అతిపెద్ద జానర్ ఫిల్మ్ ఫెస్టివల్ బియాండ్ ఫెస్ట్ 2024 జరగనుంది. ఈ ఫెస్ట్ లో ఈజిప్టియన్ థియేటర్లో సెప్టెంబర్ 26 సాయంత్రం దేవర మూవీని ప్రదర్శించనున్నారు.
ప్రలువురు హాలీవుడ్ సినీ ప్రముఖులతోపాటు అడియన్స్ కూడా ఈ చిత్రాన్ని చూడనున్నారు. ఇందుకు సెప్టెంబర్ 25న జూనియర్ ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు ఖుషి అవుతున్నారు. దేవర చిత్రంలో చివరి 40 నిమిషాల సీన్ అద్భుతంగా ఉంటుందని. వేరే లెవల్ లో ఉంటుందని ఇటీవల తారక్ చెప్పడంతో ఈ చిత్రంపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందించగా.. ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.
Important ticketing update!Tickets for Jr NTR's new epic DEVARA: PART 1 will be released next week, NOT tomorrow. We'll announce when they go live shortly. @am_cinematheque @DevaraMovie @tarak9999 pic.twitter.com/yfoJBFbxU0
— Beyond Fest (@BeyondFest) September 13, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.