Devara: ‘ఈ సముద్రం సేపల కంటే కత్తుల్ని, నెత్తుర్నే ఎక్కువ చూస్తుండాది’.. ఎన్టీఆర్‌ దేవర గ్లింప్స్‌ చూశారా?

కొరటాల శివ డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ దేవర. ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ .. ఆ సినిమాతో వచ్చిన క్రేజ్‌ అండ్ రేంజ్‌ను... పరిగణలోకి తీసుకొన.. ఎన్టీర్ కష్టపడి మరీ చేస్తున్న ఈసినిమా నుంచి, తాజాగా ఫస్ట్ గ్లింప్స్‌ రిలీజ్ అయింది. ఇదే గ్లింప్స్‌ ఇప్పుడు విజువల్‌ వండర్‌లా... మొదలై.. దేవర ఊచకోతతో.. రక్తం ప్రవాహంతో ఎండ్‌ అయింది.

Devara: 'ఈ సముద్రం సేపల కంటే కత్తుల్ని, నెత్తుర్నే ఎక్కువ చూస్తుండాది'.. ఎన్టీఆర్‌ దేవర గ్లింప్స్‌ చూశారా?
Devara Movie
Follow us
Basha Shek

|

Updated on: Jan 08, 2024 | 6:32 PM

ఎదురుచూస్తున్న కొన్ని కోట్ల మంది కళ్ల సాక్షిగా..! పెట్టుకున్న వారి అంచనాలకు ఆసరాగా…! ఎట్టకేలకు! ప్రభంజనం సృష్టించేందుకే అన్నట్టు… బ్లడ్ బాత్ చేస్తూ… బయటికి వచ్చేశాడు దేవర. రావడమేకాదు.. తన తీరేంటో… తన కత్తికున్న పదునెంతో.. సింగిల్ గ్లింప్స్‌తో చూపించేశాడు. దేవరగా నెట్టింట ట్రెండ్ అవుతున్నాడు. ఎస్ ! కొరటాల శివ డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ దేవర. ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ .. ఆ సినిమాతో వచ్చిన క్రేజ్‌ అండ్ రేంజ్‌ను… పరిగణలోకి తీసుకొన.. ఎన్టీర్ కష్టపడి మరీ చేస్తున్న ఈసినిమా నుంచి, తాజాగా ఫస్ట్ గ్లింప్స్‌ రిలీజ్ అయింది. ఇదే గ్లింప్స్‌ ఇప్పుడు విజువల్‌ వండర్‌లా… మొదలై.. దేవర ఊచకోతతో.. రక్తం ప్రవాహంతో ఎండ్‌ అయింది. ఒక్కసారిగా తన ఫ్యాన్స్‌ అండ్ ఫాలోవర్స్‌కు కిక్కివ్వడమే కాదు.. కళ్లు అప్పగించేలా చేసింది. ఇక విజువల్‌కు తోడు.. బ్లడ్‌ బాత్‌కు తోడు… గ్లింప్స్‌ చివరిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్‌… అందర్లో గూస్ బంప్స్‌ పుట్టేలా చేస్తోంది. ‘ఈ సముద్రం సేపల్ని కంటే కత్తుల్ని, నెత్తుర్నే ఎక్కువ చూసుండాది.. అందుకే దీన్ని ఎర్రసముద్రం అంటారు’ అనే డైలాగ్‌ అభిమానుల చేత విజిల్స్‌ వేయిస్తోంది. అంతేకాదు బొమ్మ బ్లాక్‌ బాస్టర్ హిట్టనే టాక్… యూనానిమస్‌గా తీసుకొస్తోంది.

ఎన్టీఆర్‌ దేవర సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులను తొలిసారిగా పలకరించనుంది అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌. మొత్తం రెండు పార్టులుగా తెరకెక్కుతోన్న ఈ పవర్ ప్యాక్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో  సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ప్రకాశ్‌ రాజ్‌, శ్రీకాంత్‌, షైన్‌ టామ్‌ చాకో, మురళీ శర్మ, అభిమన్యు సింగ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నయా మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుధ్‌ రవిచందర్‌ దేవర సినిమాకు సంగీతం అందిస్తుండడం మరో విశేషం. ఇప్పటికే చాలా భాగం వరకు షూటింగ్‌ పూర్తి చేసుకున్న దేవర మొదటి పార్ట్‌ ఏప్రిల్‌ 5న గ్రాండ్‌ గా పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కానుంది.

ఇవి కూడా చదవండి

ఎన్టీఆర్ దేవర గ్లింప్స్..

దేవర సినిమాలో ఎన్టీఆర్ లుక్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.