Jr.NTR: భయపెట్టేందుకు రాబోతున్న యంగ్ టైగర్.. మరోసారి పవర్ ఫుల్ విలన్‏గా ఎన్టీఆర్..

ఇక ఈ సినిమాతోపాటు.. బాలీవుడ్ ఇండస్ట్రీలో నేరుగా ఓ సినిమా చేస్తున్నారు తారక్. యశ్ రాజ్ ఫిలింస్ స్పై ఫ్రాంచైజీలోని వార్ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న వార్ 2 చిత్రంలో తారక్ నటించనున్నారు. ఇందులో హృతిక్ రోషన్ సైతం ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.

Jr.NTR: భయపెట్టేందుకు రాబోతున్న యంగ్ టైగర్.. మరోసారి పవర్ ఫుల్ విలన్‏గా ఎన్టీఆర్..
Ntr
Follow us
Rajitha Chanti

|

Updated on: May 19, 2023 | 4:21 PM

ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచదేశాల్లోనూ అభిమానులను సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. ఇప్పుడు ఆయన కొత్త చిత్రాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం తారక్.. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో జాన్వీ కపూర్ కథనాయికగా నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్రలలో కనిపించనున్నారు. గత కొద్ది రోజులుగా వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాతోపాటు.. బాలీవుడ్ ఇండస్ట్రీలో నేరుగా ఓ సినిమా చేస్తున్నారు తారక్. యశ్ రాజ్ ఫిలింస్ స్పై ఫ్రాంచైజీలోని వార్ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న వార్ 2 చిత్రంలో తారక్ నటించనున్నారు. ఇందులో హృతిక్ రోషన్ సైతం ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.

ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు కాస్త ఎక్కువగానే నెగిటివ్ షేడ్స్ ఉంటాయని.. అలాగే ఆయన పాత్ర ఎందుకు నెగిటివ్ గా మారుతుంది ? అనే దానికి ఓ బలమైన కారణం ఉండేలా డైరెక్టర్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో దీపికా పదుకొణే, శర్వరీ వాఘ్ కథానాయికలుగా ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఆదిత్యా చోప్రా నిర్మించనున్నారు.

ఇవి కూడా చదవండి

గతంలో జై లవ కుశ సినిమాలో తారక్ నెగిటివ్ యాంగిల్ ఎలా ఉంటుందో చూపించిన సంగతి తెలిసిందే. ఇందులో జై పాత్రలో పవర్ ఫుల్ విలన్ గా కనిపించారు తారక్. ఓవైపు పాజిటివ్ షేడ్స్, మరోవైపు హీరోయిజం చూపించారు. ఇక ఇప్పుడు పవర్ ఫుల్ విలన్ గా కనిపించనున్నారు. వార్ 2 సినిమా రెగ్యూలర్ షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.