Samantha: సాయి పల్లవి డాన్స్‏పై సమంత ఆసక్తికర కామెంట్స్.. వైరలవుతున్న వీడియో..

ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఓవైపు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న సామ్.. ఇటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటున్నారు. మోటివేషనల్ కోట్స్, మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటారు. ఈ క్రమంలో తాజాగా సమంతకు సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

Samantha: సాయి పల్లవి డాన్స్‏పై సమంత ఆసక్తికర కామెంట్స్.. వైరలవుతున్న వీడియో..
Samantha, Sai Pallavi
Follow us

|

Updated on: May 19, 2023 | 3:54 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఖుషి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ మెయిన్ రోల్ పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఓవైపు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న సామ్.. ఇటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటున్నారు. మోటివేషనల్ కోట్స్, మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటారు. ఈ క్రమంలో తాజాగా సమంతకు సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. అందులో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి డ్యాన్స్ పై ప్రశంసలు కురిపించారు.

కెరీర్ ఆరంభంలో సమంత ఢీ డ్యాన్స్ షోకు ముఖ్య అతిథిగా హజరయ్యారు. అందులో సాయి పల్లవి కంటెస్టెంట్‏గా పార్టిసిపేట్ చేసింది. ఈ షోలో సాయి పల్లవి డ్యాన్స్ కు సామ్ ఫిదా అయిపోయింది. మీరు డ్యాన్స్ చేస్తున్నప్పుడు నా కళ్లను తప్పించలేను. అద్భుతంగా చేశారు అంటూ సామ్ చెప్తుండగా.. సాయి పల్లవి థాంక్స్ అంటూ బదులిచ్చింది. ఈ వీడియోలో సామ్, సాయి పల్లవి లుక్స్ గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.

ఇవి కూడా చదవండి

ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచమయైన సాయి పల్లవి.. తొలి చిత్రంతోనే ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా నటనతోనే కాదు.. ఆమె డాన్స్ కు ఆడియన్స్ మంత్రముగ్దులయ్యారు. ఎలాంటి గ్లామర్ షో లేకుండానే తన సహజ నటనతో సౌత్ ఆడియన్స్ హృదయాలు దొచేస్తోంది సాయి పల్లవి. గతంలో ఢీ డ్యాన్స్ షోలో పార్టిసిపేట్ చేసింది సాయిపల్లవి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.