Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jawan Prevue: దుమ్మురేపిన జవాన్ ట్రైలర్.. షారుక్ మరో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం

Jawan Trailer: ఇప్పుడు జవాన్ తో అలరించడానికి రెడీ అవుతున్నాడు షారుక్. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది ఈ మూవీ.

Jawan Prevue: దుమ్మురేపిన జవాన్ ట్రైలర్.. షారుక్ మరో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం
Jawan
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 10, 2023 | 1:44 PM

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటిస్తున్నసరికొత్త మూవీ జవాన్. రీసెంట్ గా పఠాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు షారుక్. ఈ సినిమా బాలీవుడ్ రికార్డులను తిరగ రాసింది. ఇక ఇప్పుడు జవాన్ తో అలరించడానికి రెడీ అవుతున్నాడు షారుక్. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా జవాన్ ను రూపొందిస్తున్నాడు అట్లీ. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే గతంలో వచ్చిన గ్లిమ్స్ కూడా ఆకట్టుకుంది. ఈ సినిమా నయన తార హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

జవాన్ ట్రైలర్ అదిరిపోయింది. ట్రైలర్ మొత్తం యాక్షన్ సీన్స్ తో నింపేశారు. చూడబోతుంటే ఈ మూవీ కూడా రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్ . ఇక ఈ మూవీలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. నయన్ తో పాటు దీపికా పదుకొనె కూడా ఈ మూవీలో కనిపించనున్నారు. అదే విధంగా ప్రియమణి కూడా నటిస్తున్నారు.

ఇక ఈ మూవీ ట్రైలర్ లో చివరిగా షారుక్ ఖాన్ గుండుతో కనిపించి అందరిని అవాక్ అయ్యేలా చేశారు. ట్రైలర్ మొత్తం షారుక్ చెప్పే డైలాగ్ తోనే ఉంటుంది. ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ట్రైలర్ లో బ్యా గ్రౌండ్ లో వచ్చిన మ్యూజిక్ అదిరిపోయింది. జవాన్ సినిమాను సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.