Director Anudeep AV: “పాలకూర పప్పు.. అనుదీప్ అన్న నిప్పు”..ఈ డైరెక్టర్ నిజంగా జాతిరత్నమే…

తెలుగులో ఇప్పుడు యువ దర్శకులు అద్భుతాలు చేస్తున్నారు. వినూత్న ఐడియాలతో సినిమాలు తీస్తూ.. సత్తా చాటుతున్నారు. తాజాగా ఆ జాబితాలో చేరిపోయారు జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్.

Director Anudeep AV: పాలకూర పప్పు.. అనుదీప్ అన్న నిప్పు..ఈ డైరెక్టర్ నిజంగా జాతిరత్నమే...
Director Anudeep Kv
Follow us

|

Updated on: Mar 12, 2021 | 6:26 PM

తెలుగులో ఇప్పుడు యువ దర్శకులు అద్భుతాలు చేస్తున్నారు. వినూత్న ఐడియాలతో సినిమాలు తీస్తూ.. సత్తా చాటుతున్నారు. తాజాగా ఆ జాబితాలో చేరిపోయారు జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్. గురువారం శివరాత్రి సందర్భంగా రిలీజైన ఈ సినిమా హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. కాగా ఇప్పుడు ఈ దర్శకుడు కూడా ఇంటర్నెట్‌లో ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతున్నాడు.

అవును అందుకు కారణం అతడి నడవడిక, మాట్లాడే విధానం. జాతిరత్నాలు సినిమాపై బజ్ ముందు నుంచి ఉంది కానీ రిలీజ్ డేట్ విడుదల చేసే వరకు ఈ కుర్ర దర్శకుడు ఎవరికీ తెలీదు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా యాంకర్ సుమ హోస్ట్ చేసే క్యాష్ ప్రొగ్రాంకు వచ్చారు మూవీ టీమ్. అక్కడ ఈ దర్శకుడు చేసిన హంగామా అంతా, ఇంతా కాదు. మధ్యమధ్యలో పంచ్‌లు పేలుస్తూనే.. తన అమాయకపు మాటల్తో అందర్నీ నవ్వించాడు ఈ దర్శకుడు. యాంకర్ సుమ అయితే  ఇతడి అమాయకత్వానికి ప్రొగ్రామ్ అంతా నవ్వుతూనే కనిపించింది. కాగా ఇతడు మరో యువ దర్శకుడు నాగ్ అశ్విన్‌కు బెస్ట్ ఫ్రెండ్ అట. ఈ షోతో మనోడు మీమ్స్ క్రియేట్ చేసేవాళ్లకు ఓ మంచి సరుకుగా మారిపోయాడు. ‘పాలకూర పప్పు.. అనుదీప్ అన్న నిప్పు’ అంటూ స్లోగన్స్ కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. అతడిపై గతంలో చేసిన ఓ ప్రాంక్ కూడా వైరల్‌గా మారింది. ఇక జాతిరత్నాలు ఆడియో ఫంక్షన్‌లో అయితే దర్శకుడు అనుదీప్‌ గురించి వేసిన ఏవీ కూడా అంతే కామెడీగా ఉంది. ఏదైనా చిన్న ఇష్యూ దొరికితే చాలు.. వైరల్ చేయడానికి రెడీగా ఉంటారు కీ బోర్డ్ వారియర్స్. ఇక హిట్ కొట్టిన ఈ అమాయకపు దర్శకుడ్ని అంత ఈజీగా వదిలేస్తారా.. చెప్పండి.

తెలంగాణలోని సంగారెడ్డి ప్రాంతానికి చెందిన అనుదీప్ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పదేళ్ల క్రితం తన సినిమా జర్నీని ప్రారంభించాడు. అతడి మొదటి సినిమా పిట్టగోడ. అయితే ఈ మూవీ అంతగా విజయవంతం అవ్వలేదు. తాజాగా జాతిరత్నాలతో మంచి హిట్ అందుకున్నాడు.

Also Read:

5వ భార్య భర్తకు మొదట ఫోర్న్ వీడియోలు చూపించింది.. ఆ తర్వాత కాళ్లు, చేతులు కుర్చీకి కట్టింది.. చివరికి..

పంజాగుట్ట ఫ్లైఓవర్ కింద అగ్నిప్రమాదం.. పిల్లర్లకు అంటుకున్న మంటలు.. దట్టంగా వ్యాపించిన పొగ

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?