Jani Master: ‘ట్రెండింగ్‌లో ఉంచినందుకు అందరికీ థ్యాంక్స్’.. జానీ మాస్టర్ షాకింగ్ పోస్ట్ వైరల్

జానీ మాస్టర్ జైలు నుంచి రిలీజయ్యాడు. లైంగిక వేధింపుల కేసులో బెయిల్ మంజూరు కావడంతో శుక్రవారం (అక్టోబర్ 25) అతను చంచల్ గూడ జైలు నుంచి బయటకు వచ్చాడు. అయితే అంతకు ముందే జానీ సోషల్ మీడియా ఖాతా నుంచి షేర్ అయిన ఒక పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇంతకీ అందులో ఏముందంటే?

Jani Master: ట్రెండింగ్‌లో ఉంచినందుకు అందరికీ థ్యాంక్స్.. జానీ మాస్టర్ షాకింగ్ పోస్ట్ వైరల్
Jani Master

Updated on: Oct 25, 2024 | 7:14 PM

తన దగ్గర పనిచేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అభియోగాలు ఎదుర్కొంటోన్న జానీ మాస్టర్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. తెలంగాణ హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం (అక్టోబర్ 25) చంచల్ గూడ జైలు నుంచి బయటకు వచ్చాడు జానీ మాస్టర్. అరెస్టైన సుమారు 36 రోజుల తర్వాత జానీ మాస్టర్ జైలు నుంచి రిలీజయ్యాడు. అయితే బెయిల్ వచ్చిందనే వార్తలు రాగానే.. జానీ మాస్టర్ ఖాతా నుంచి ఒక షాకింగ్ పోస్ట్ వైరల్ అయ్యింది. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. హిందీ మూవీ భూల్‌ భులయ్యా 3 టైటిల్ ట్రాక్ కు కొరియోగ్రఫీ అందించాడు జానీ మాస్టర్. ప్రస్తుతం ఈ సాంగ్ సామాజిక మాధ్యమాల్లో బాగా ట్రెండ్ అవుతోంది. హరే రామ్.. హరే రామ్ అంటూ సాగిన ఈ సాంగ్ కు యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. ఎప్పటిలాగే జానీ మాస్టర్ అందించిన స్టెప్పులు నెక్ట్స్ లెవెల్ అనేలా ఉన్నాయి. ఈక్రమంలోనే తన సాంగ్ రికార్డులు సృష్టించడంతో జానీ మాస్టర్ తన ఆనందాన్ని అందరితో పంచుకుంటూ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. ‘నా సాంగ్ స్పూకీ సైడ్‌ను ట్రెండింగ్‌లో ఉంచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు’ అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ను షేర్ చేశాడు. దీనికి ‘భూల్ భులయ్యా3’ టీమ్‌ను ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కుని బెయిల్ పై బయటకు వచ్చిన జానీ మాస్టర్ కు ఊహించని షాక్ తగిలింది. ఈ ఘటనకు ముందు పుష్ప 2 మూవీలో స్పెషల్ సాంగ్ కు జానీ నే కొరియోగ్రఫీ చేయాల్సి ఉంది. అయితే అనూహ్యంగా జానీ మాస్టర్ జైలుకు వెళ్లడంతో ఈ స్పెషల్ సాంగ్ కొరియోగ్రఫీ ప్రశ్నార్థకంగా మారింది. అయితే గురువారం జానీ మాస్టర్ కి కూడా బెయిల్ మంజూరు కావడంతో రిపోర్టర్లు ఈ అంశంపై పుష్ఫ 2 నిర్మాతలను ప్రశ్నించారు. దీనికి వారు సమాధానమిస్తూ.. ‘ మేం ఆల్రెడీ కొరియోగ్రాఫర్ ను మార్చేశాం. వేరే కొరియోగ్రాఫర్ తో సాంగ్ షూట్ చేయిస్తున్నాం. నవంబర్ 4 నుంచి షూట్ కూడా స్టార్ట్ అవుతుంది’ అని చెప్పుకొచ్చారు. అంటే పుష్ప-2 చిత్రానికి జానీ మాస్టర్‌ను దూరంగానే పెట్టినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

జానీ మాస్టర్ షేర్ చేసిన పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..