Janhvi Kapoor: హాట్ బ్యూటీ జాన్వీ కపూర్‌ను పెళ్లి చేసుకోవాలంటే ఈ క్వాలిటీస్ ఉండాలట…
ఇప్పుడు ఈ చిన్నది తెలుగులో సినిమా చేస్తోంది.బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న జాన్వీకపూర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెడుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందితున్న ఈ సినిమా 'ఎన్టీఆర్ 30' (వర్కింగ్ టైటిల్)..
అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ భామ జాన్వీ కపూర్.. ధఢక్ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ అమ్మడు వరుస సినిమాలతో బాలీవుడ్ లో రాణిస్తోంది. ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక ఇప్పుడు ఈ చిన్నది తెలుగులో సినిమా చేస్తోంది.బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న జాన్వీకపూర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెడుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందితున్న ఈ సినిమా ‘ఎన్టీఆర్ 30’ (వర్కింగ్ టైటిల్) షూటింగ్ మార్చి 31 ప్రారంభమయింది.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే తారక్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ మూవీ షూటింగ్ నుంచి కొన్ని ఫోటోలు లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలోనే జాన్వీ కూడా షూటింగ్ లో జాయిన్ అవ్వనుంది.
తాజాగా జాన్వీ కపూర్ తనకు కాబోయేవాడికి ఉండాల్సిన లక్షణాలు తెలిపింది. నా వృత్తిని గౌరవించే వ్యక్తి నా జీవితంలోకి రావాలని నేను కోరుకుంటున్నానని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. అలాగే తనకు కాబోయేవాడికి మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలి, నన్ను కేరింగ్ గా చూసుకునే వ్యక్తి, అన్నికంటే ముఖ్యం మా నాన్న కంటే హైట్ ఉండే వ్యక్తి కావాలని ఆమె అన్నారు.