Vinayakan: ఎయిర్ పోర్టులో కానిస్టేబుల్ పై దాడి.. ‘జైలర్’ నటుడు వినాయకన్ అరెస్ట్..
వినాయకన్.. కొచ్చి నుంచి హైదరాబాద్ మీదుగా గోవా వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన పై స్పందించిన వినాయకన్ తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. సీఐఎస్‌ఎఫ్ అధికారులు తనను ఎయిర్‌పోర్టులోని ఓ గదిలోకి తీసుకెళ్లి దాడి చేశారని వినాయకన్ అన్నారు. కావాలంటే సీసీటీవీ ఫుటేజీ చెక్ చేసుకోమని అన్నాడు.
ప్రముఖ నటుడు వినాయకన్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో సీఐఎస్ఎప్ (కేంద్ర పారిశ్రామికా భద్రత దళం) కానిస్టేబుల్ పై దాడి చేయడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వినాయకన్.. కొచ్చి నుంచి హైదరాబాద్ మీదుగా గోవా వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన పై స్పందించిన వినాయకన్ తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. సీఐఎస్‌ఎఫ్ అధికారులు తనను ఎయిర్‌పోర్టులోని ఓ గదిలోకి తీసుకెళ్లి దాడి చేశారని వినాయకన్ అన్నారు. కావాలంటే సీసీటీవీ ఫుటేజీ చెక్ చేసుకోమని అన్నాడు.
పోలీసులు తనను ఎందుకు కస్టడీలోకి తీసుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే నివేదిక ప్రకారం.. వినాయకన్, CISF అధికారి మధ్య మాటల వాగ్వాదం తరువాత వినాయకన్ సదరు కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నాడని సమాచారం. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సూపర్ హిట్ జైలర్ సినిమాతో ఫేమస్ అయ్యాడు వినాయకన్. ఇందులో వర్మ పాత్రలో అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత దక్షిణాదిలో వినాయకన్ పేరు మారుమోగింది.
అయితే ఇలాంటి గొడవలో వినాయకన్ పేరు వినిపించడం ఇది మొదటి సారి కాదు. గతంలో అక్టోబర్ 23న కూడా దురుసు ప్రవర్తన వల్ల జైలుపాలయ్యాడు. ప్రస్తుతం వినాయకన్ తెలుగుతోపాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో నటిస్తున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.