AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meera Nandan: గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. ఫోటోస్ వైరల్..

చక్కటి రూపం, ట్రెడిషనల్ లుక్ లో కనిపించి తెలుగు అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు మీరా నందన్. తాజాగా ఈ హీరోయిన్ పెళ్లి చేసుకుంది. ఎలాంటి హడావిడి లేకుండా గుడిలో సింపుల గా వివాహం చేసుకుంది. శనివారం ఉదయమే జరిగిన ఈ వేడుకకు పలువురు సెలబ్రెటీలు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Meera Nandan: గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. ఫోటోస్ వైరల్..
Meera Nandan
Rajitha Chanti
|

Updated on: Jun 29, 2024 | 9:17 AM

Share

మీరా నందన్.. ఈపేరు జనాలకు అంతగా తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు తెలుగు థియేటర్లలో సంచలనం సృష్టించిన జై బోలో తెలంగాణ మూవీ హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. 2011లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఈమూవీలో జగపతి బాబు, స్మృతి ఇరానీ, సందీప్ సింగ్ ప్రధాన పాత్రలు పోషించగా.. మీరా నందన్ కథానాయికగా నటించింది. చక్కటి రూపం, ట్రెడిషనల్ లుక్ లో కనిపించి తెలుగు అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు మీరా నందన్. తాజాగా ఈ హీరోయిన్ పెళ్లి చేసుకుంది. ఎలాంటి హడావిడి లేకుండా గుడిలో సింపుల గా వివాహం చేసుకుంది. శనివారం ఉదయమే జరిగిన ఈ వేడుకకు పలువురు సెలబ్రెటీలు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

శనివారం ఉదయం గురువాయూర్ ఆలయంలో లండన్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న శ్రీజుతో మీరా నందన్ ఏడడుగులు వేసారు. వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. అంతకు ముందు జరిగిన హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలలో పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు. గతేడాది సెప్టెంబర్ 13న వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. మీరా, శ్రీజు ఇద్దరు ప్రముఖ మ్యాట్రిమోని ద్వారా కలుసుకున్నారని సమాచారం.

మీరా నందన్ మలయాళంలో అనేక చిత్రాల్లో నటించింది. 1990 నవంబర్ 26న కేరళలోని కొచ్చి ప్రాంతంలో జన్మించిన మీరా నందన్ జర్నలిజం పూర్తి చేసి మొదట్లో ప్రకటనలు చేసింది. ఆ తర్వాత స్టార్ సింగర్ రియాల్టీ షోకు యాంకరింగ్ చేసింది. 2007లో ముల్లా సినిమాతో సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తమిళం, కన్నడ, తెలుగు భాషలలో పలు సినిమాల్లో నటించింది. ఇందులో జై బోలో తెలంగాణ సినిమా ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకున్నా మీరా నందన్ కు అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. మీరా చివరగా ఎన్నలుమ్ ఎంటే ఆలియా చిత్రంలో నటించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.