Amala Paul: వామ్మో.. ఇదేం యాటిట్యూడ్ అమలాపాల్.. ఎర్రటి ఎండలో వెళ్లమని చెప్పింది.. హెయిర్ స్టైలిస్ట్ షాకింగ్ కామెంట్స్
అలాంటి ఒక సంఘటనను గుర్తుచేసుకుంటూ, హీరోయిన్ అమలా పాల్ తమ ప్రవర్తించిన తీరును బయటపెట్టింది ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ హేమ. ఎర్రటి ఎండ అని చూడకుండా తమను కేరవాన్ నుంచి దిగి వెళ్లిపోవాలని చెప్పిందని.. సౌత్ ఇండస్ట్రీలో అలాంటి రూల్స్ ఉన్నాయేమో అని అనుకున్నట్లు చెప్పుకొచ్చింది. హెయిర్ స్టైలిస్ట్స్, మేకప్ ఆర్టిస్టులు వ్యానిటీ వ్యాన్ లో కూర్చొవడానికి అనుమతి ఉండదని తెలిపింది.
వెండితెరపై నటీనటులు అంతంగా కనిపించేలా చేయడంలో మేకప్ ఆర్టిస్టులు, హెయిర్ స్టైలిస్ట్లు ముఖ్య పాత్ర పోషిస్తారు. పాత్రకు తగినట్లుగా హీరోహీరోయిన్లను అందంగా రెడీ చేసి అడియన్స్ హృదయాల్లో స్థానం కల్పించేలా చేస్తారు. కానీ సినిమా షూటింగ్ సెట్లో వారికి తగిన గౌరవం, గుర్తింపు ఉండదు. అలాగే కొన్నిసార్లు పలువురు తారలతో తమకు చేదు అనుభవాలు కూడా ఎదురవుతుంటాయని అంటున్నారు మేకప్ ఆర్టిస్టులు. అలాంటి ఒక సంఘటనను గుర్తుచేసుకుంటూ, హీరోయిన్ అమలా పాల్ తమ ప్రవర్తించిన తీరును బయటపెట్టింది ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ హేమ. ఎర్రటి ఎండ అని చూడకుండా తమను కేరవాన్ నుంచి దిగి వెళ్లిపోవాలని చెప్పిందని.. సౌత్ ఇండస్ట్రీలో అలాంటి రూల్స్ ఉన్నాయేమో అని అనుకున్నట్లు చెప్పుకొచ్చింది. హెయిర్ స్టైలిస్ట్స్, మేకప్ ఆర్టిస్టులు వ్యానిటీ వ్యాన్ లో కూర్చొవడానికి అనుమతి ఉండదని తెలిపింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హెయిర్ స్టైలిస్ట్ హేమ మాట్లాడుతూ.. “ఒకసారి నేను హీరోయిన్ అమలా పాల్ తో కలిసి చెన్నై షూటింగ్ కు వెళ్లాను. నాకు ఆమె గురించి తెలియదు. కేవలం ఓ స్నేహితుడి ద్వారా మాత్రమే పరిచయం. ఏప్రిల్, మేలో షూటింగ్ కోసం వెళ్లినప్పుడు అక్కడ చాలా ఎండ, వేడిగా ఉంది. దీంతో నీడ కోసం చూస్తే ఆ లొకేషన్ లో ఒక చెట్టు కూడా లేదు. దీంతో అక్కడే ఉన్న వ్యానిటీ వ్యాన్ లోపలికి వెళ్లాము. అందులో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి కళాకారులు కూర్చోవడానికి, మరొకరి టెక్నికల్ టీం ఉండటానికి. కానీ మేము లోపల కూర్చోగానే అమలా పాల్ మేనేజర్ వచ్చి మమ్మల్ని బయటకు వెళ్లిపోవాలని.. అందులో కూర్చొవడానికి వీల్లేదని చెప్పాడు. దీంతో నేను మేకప్ ఆర్టిస్టు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నాం. ఇంత వేడిలో బయటకు ఎక్కడికి వెళ్తాము ? అని అనుకున్నాము.. కానీ ఆ వ్యాన్ నుంచి దిగవలసి వచ్చింది” అని చెప్పుకొచ్చింది.
“దక్షిణాదిలో ఎలా పనిచేస్తారో నాకు తెలియదు. వ్యానిటీ వ్యాన్ లోపలికి హెయిర్ స్టైలిస్ట్, మేకప్ ఆర్టిస్టులు రాకూడదని నియమాలు ఉన్నాయేమో అక్కడ. సౌత్ ఇండస్ట్రీలో మేకప్ ఆర్టిస్టులు, హెయిర్ స్టైలిస్ట్ లకు విలువ ఇవ్వరు. అందుకే వారికి మనల్ని మనం ఎలా పరిచయం చేసుకోవాలి ? నేను టబు వంటి వారి దగ్గర పనిచేశానని ఎలా చెప్పాలి. ? టబు మమ్మల్ని బాగా చూసుకుంటారు. మా అందరి కోసం మొత్తం వ్యా్న్ బుక్ చేస్తారు. కానీ సౌత్ ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితి ఎదురైంది” అని తెలిపింది. ప్రస్తుతం హేమ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ కాగా.. అమలా పాల్ యాటిట్యూడ్ పై విమర్శలు చేస్తున్నారు నెటిజన్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.