Jagapathi Babu: సౌందర్యతో ఎఫైర్ నిజమేనన్న జగపతిబాబు.. అసలు విషయం బయటపెట్టేశారుగా..
ఒకప్పుడు హీరోలకు ఉండే క్రేజే వేరు.. అప్పటి హీరోలందరూ తమ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకునేవారు. ముఖ్యంగా శోభన్ బాబు సోగ్గాడుగా ప్రేక్షకుల చేత మన్నలను అందుకున్నారు.
ఒకప్పుడు హీరోలకు ఉండే క్రేజే వేరు.. అప్పటి హీరోలందరూ తమ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకునేవారు. ముఖ్యంగా శోభన్ బాబు సోగ్గాడుగా ప్రేక్షకుల చేత మన్నలను అందుకున్నారు. ఆయన అందంతో, నటనతో ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. అదే రేంజ్ లో ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకులను అలరించిన మరో హీరో ఎవరంటే టక్కున చెప్పే పేరు జగపతి బాబు. ఒకప్పుడు హ్యాండ్సమ్ హీరోగా టాలీవుడ్ లో రాణించారు జగపతిబాబు(Jagapathi Babu). ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించారు జగ్గూభాయ్. ఇక సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చిన జగపతి బాబు ఇప్పుడు విలన్ గా రాణిస్తున్నారు. బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన లెజెండ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు జగపతిబాబు.
అయితే అప్పట్లో జగపతి బాబు సౌందర్య కాంబినేషన్ సూపర్ హిట్. ఈ ఇద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ఇద్దరు ఆన్ స్క్రీన్ మీద చూడముచ్చటగా కనిపించేవారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగపతి బాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. అయితే తనకు హీరోయిన్ సౌదర్యకు మధ్య ఎదో ఎఫైర్ ఉందని చాలా సార్లు వార్తలు పుట్టుకొచ్చిన విషయం గురించి ఆయన స్పందించారు. తనకు సౌందర్యకు మధ్య ఎదో ఎఫైర్ ఉంది అని అంటున్నారు. అది నిజమే ఆమెకు నాకు ఎఫైర్ ఉంది. కానీ మీరు అనుకుంటున్నట్టు కాదు. ఆమె నాకు మంది స్నేహితురాలు. సౌదర్య అన్నయ్య కూడా నాకు మంచి ఫ్రెండ్. అలాగే మా రెండు ఫ్యామిలీలు చాలా క్లోజ్. దాంతో ఆమె మా ఇంటికి వస్తూ ఉండేది, నేనుకూడా వాళ్ళ ఇంటికి వెళ్తుంటా.. దాన్ని జనాలు తప్పుగా అర్ధం చేసుకున్నారు. సౌదర్య అలాంటిది కాదు. మా ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందన్న వార్తలు నేను కూడా విన్నా.. కానీ నేను వాటిని సీరియస్ గా తీసుకోలేదు అని అన్నారు జగపతిబాబు.