టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో – డైరెక్టర్ల కాంబినేషన్ రిపీట్.. లేటెస్ట్‌గా అల్లరి నరేష్‌తో కలిసి..
ఏ ఇండస్ట్రీలో అయినా రిపీట్ కాంబినేషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాంబినేషన్ కుదిరింది అనుకుంటే.. ఎన్నిసార్లైన కలిసి పని చేస్తుంటారు హీరోలు, దర్శకులు.
ఓ సినిమా చేస్తున్నపుడే దర్శకుడి సత్తా ఏంటనేది హీరోలకు అర్థమైపోతుంది. ఆయనతో మరోసారి పని చేయొచ్చా లేదా అనే క్లారిటీ వచ్చేస్తుంది. తాజాగా కొందరు హీరోలు, దర్శకులు ఇదే చేస్తున్నారు. ఓ సినిమా సెట్స్‌పై ఉండగానే.. ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా తమ కాంబినేషన్‌లో మరో సినిమా అనౌన్స్ చేస్తున్నారు. మరి అలా వస్తున్న రిపీట్ కాంబినేషన్స్ ఏంటి..? ఎవరెవరు కలిసి పని చేస్తున్నారు..?
ఏ ఇండస్ట్రీలో అయినా రిపీట్ కాంబినేషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాంబినేషన్ కుదిరింది అనుకుంటే.. ఎన్నిసార్లైన కలిసి పని చేస్తుంటారు హీరోలు, దర్శకులు. తాజాగా పూరీ జగన్నాథ్ ఇదే చేస్తున్నారు. లైగర్ విడుదలకు ముందే.. విజయ్ దేవరకొండతో జనగణమన మొదలుపెట్టారు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్. లైగర్‌లో విజయ్ నటనకు ఫిదా అయిన పూరీ.. వెంటనే JGM అతడితోనే షురూ చేసారు. ఈ సినిమా 2023, ఆగస్ట్ 3న విడుదల కానుంది.
తాజాగా దర్శకుడు విజయ్ కనకమేడల ఇదే చేస్తున్నారు. గతేడాది నాంది సినిమాతో విజయం అందుకున్నారు ఆయన. అల్లరి నరేష్‌ను నటుడిగా మరో మెట్టు ఎక్కించిన సినిమా ఇది. విజయంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది నాంది. తాజాగా ఇదే కాంబినేషన్‌లో ఉగ్రం అనే సినిమా మొదలైంది. తన రెండో సినిమాను వరసగా నరేష్‌తోనే చేస్తున్నారు విజయ్ కనకమేడల. ఇది కూడా పూర్తిగా సీరియస్‌గా సాగే కథే.
తెలుగులోనే కాదు తమిళంలోనూ ఇదే జరుగుతుంది. అక్కడ అజిత్ ఓ దర్శకుడిని నమ్మారంటే చాలు.. వరసగా ఆయనతో సినిమాలు చేస్తుంటారు. గతంలో శివకు వరసగా 4 సినిమాలు ఇలాగే ఇచ్చారు అజిత్. తాజాగా వినోద్ CH ఆ స్థానంలోకి వచ్చేసారు. నేర్కొండ పార్వై, వలిమై తర్వాత వరసగా మూడోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుంది. అలాగే త్రివిక్రమ్, కొరటాల లాంటి దర్శకులు సైతం.. వరసగా హీరోలను రిపీట్ చేస్తుంటారు. వాళ్ళ కంఫర్ట్ జోన్ చూసుకుని సినిమాలు చేస్తుంటారు ఈ డైరెక్టర్స్.
మరిన్ని సినిమా వార్తలు చదవండి