Swara Bhasker: “సుశాంత్ మరణం తర్వాతే ఇలా జరుగుతోంది”.. స్వరా భాస్కర్ షాకింగ్ కామెంట్స్
ఇటీవల బాలీవుడ్ పరిస్థితి అంతగా బాలేదనే చెప్పాలి. సాలిడ్ హిట్ పడి అక్కడ చాలా కాలం అయ్యింది. స్టార్ హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా అవి బక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి.
ఇటీవల బాలీవుడ్ పరిస్థితి అంతగా బాలేదనే చెప్పాలి. సాలిడ్ హిట్ పడి అక్కడ చాలా కాలం అయ్యింది. స్టార్ హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా అవి బక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. అప్పుడు వచ్చిన కాశ్మీరీ ఫైల్స్ సినిమా తప్ప ఇంతవరకు బాలీవుడ్ లో బిగెస్ట్ హిట్ ఏదీ లేదు. అక్షయ్ కుమార్ చేస్తున్న సినిమాలనీ ఓటీటీలో రిలీజ్ అవుతున్నా అవి హిట్ అవ్వడం లేదు. ఇక షారుక్ ఖాన్ సినిమాలు ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదు. అలాగే అమీర్ ఖాన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న లాల్ సింగ్ చడ్డా సినిమా దారుణంగా నిరాశపరిచింది. దాంతో యంగ్ హీరో రణబీర్ కపూర్ రంగంలోకి దిగిన కూడా ఫలితం లేకుండా పోయింది. ఆయన నటించిన షంషేర సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యింది. ఇదిలా ఉంటే ఈ మధ్య అక్కడ బాయ్‌కాట్ అనేది ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. దాంతో బాలీవుడ్ లో ఏంజరుగుతుందో అర్ధంకాని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే బాలీవుడ్ ఇలా పడిపోవడానిక కారణం ఇదే అంటూ అందాల భామ స్వరా భాస్కర్(Swara Bhasker)చెప్పుకొచ్చారు.
స్వర భాస్కర్ నిత్యం ఎదో ఒక వివాదంలో నాలుగుతూనే ఉంటుంది. సంచలన కామెంట్స్ చేసి ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది ఈ భామ. ‘జహాన్ చార్ యార్’ అనే సినిమాతో స్వర రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంట్రవ్యూలో స్వరా భాస్కర్ మాట్లాడుతూ.. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానంతరం బాలీవుడ్ పై ద్వేషం పెంచడమే ప్రస్తుత ట్రెండ్ అని ఆమె పేర్కొంది. నార్త్ వర్సెస్ సౌత్ ఈ రకంగా డివైడ్ చేయడం నాకు ఇష్టం లేదు”. ఆర్టిస్టులుగా పరిశ్రమగా బాక్సాఫీస్ వద్ద సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తే అందరికీ మంచిదని నేను భావిస్తున్నాను. కేవలం బాలీవుడ్ నే తప్పుపట్టడం సరికాదు. సౌత్ లో అన్ని సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయా..? అని ఆమె ప్రశ్నించారు. బాలీవుడ్ ద్వేషం పెరగడానికి రకరకాల కారణాలు ఉన్నాయని స్వరా భాస్కర్ అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి