Salaar: సలార్ పై మరోసారి జగ్గుభాయ్ ఆసక్తికర కామెంట్స్.. ఇంతకీ మెయిన్ విలన్ ఎవరు ?..
ఇక ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై హైప్ క్రియేట్ చేయడమే కాకుండా..ఈసారి ప్రభాస్ ఖాతాలో హిట్టు పడడం ఖాయంగా తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ను ప్రశాంత్ నీల్ ఏ రేంజ్లో చూపిస్తాడని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా విలక్షణ నటుడు జగపతి బాబు సలార్ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సలార్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు అంతగా ఆకట్టుకోకపోవడంతో ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ ఆశలన్ని సలార్ చిత్రంపైనే ఉన్నాయి. కేజీఎఫ్ తెరకెక్కించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ మూవీని రూపొందిస్తుండడంతో సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇక ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై హైప్ క్రియేట్ చేయడమే కాకుండా..ఈసారి ప్రభాస్ ఖాతాలో హిట్టు పడడం ఖాయంగా తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ను ప్రశాంత్ నీల్ ఏ రేంజ్లో చూపిస్తాడని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా విలక్షణ నటుడు జగపతి బాబు సలార్ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతి బాబు మాట్లాడుతూ.. సలార్ సినిమాలో ప్రభాస్ కు.. తనకు మధ్య ఒక్క సీన్ కూడా లేదని అన్నారు. సెకండ్ పార్ట్ లో తమ మధ్య సన్నివేశాలు ఉండే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు సినీప్రియులకు మరిన్ని అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే ఇన్నాళ్లు జగ్గూభాయ్ మెయిన్ విలన్ అనుకున్నారంతా. కానీ ఇప్పుడు ప్రభాస్ తో తనకు ఒక్క సీన్ కూడా కాలేదని చెప్పడంతో ఇంతకీ మెయిన్ విలన్ ఎవరు అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.




ఇదిలా ఉంటే.. సలార్ చిత్రాన్ని రెండు భాగాలుగా తీస్తున్న విషయాన్ని టీజర్ ద్వారా తెలియజేశారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇక రెండో భాగంలో వీరిద్దరూ ఎదురుపడే సీన్స్ ఉండొచ్చు అంటున్నారు. కేజీఎఫ్ లో కూడా మెయిన్ విలన్ తో యశ్ రెండో భాగంలోనే తలపడతాడు. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా.. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.