Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ ఇద్దరు అన్నదమ్ములు ఇండస్ట్రీలో క్రేజీ హీరోస్.. ఫాలోయింగ్ చూస్తే మతిపోవాల్సిందే.. గుర్తుపట్టండి..

ఇద్దరు అన్నదమ్ములు ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోస్. ఎవరో గుర్తుపట్టండి. ఇద్దరికీ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మాములుగా లేదండోయ్. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు పోటీ పడుతుంటారు. తాజాగా అన్నయ్య చేతిలో నాలుగైదు సినిమాలు ఉండగా.. ఇటీవలే ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు తమ్ముడు.

Tollywood: ఈ ఇద్దరు అన్నదమ్ములు ఇండస్ట్రీలో క్రేజీ హీరోస్.. ఫాలోయింగ్ చూస్తే మతిపోవాల్సిందే.. గుర్తుపట్టండి..
Actor
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 16, 2023 | 1:13 PM

పైన ఫోటోను చూశారు కదా.. అందులో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోస్. ఎవరో గుర్తుపట్టండి. ఇద్దరికీ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మాములుగా లేదండోయ్. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు పోటీ పడుతుంటారు. తాజాగా అన్నయ్య చేతిలో నాలుగైదు సినిమాలు ఉండగా.. ఇటీవలే ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు తమ్ముడు. గుర్తుపట్టారు కాదా.. వాళ్లే రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఆనంద్ దేవరకొండ. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన చిన్ననాటి ఫోటో ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. విజయ్ ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతుండగా.. ఇప్పుడిప్పుడె ఆనంద్ హీరోగా తనకంటూ ఓ స్టార్ డమ్ అందుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా బేబీ సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు ఆనంద్.

ఇటీవల లైగర్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు విజయ్. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ అయ్యింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటించింది. ఇక ఇప్పుడు డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన సమంత నటిస్తుండగా.. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ ఆకట్టుకున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇక ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నారు. సాయి రాజేశ్ దర్శకత్వంలో ఆనంద్ నటించిన బేబీ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలకపాత్రలలో నటించారు. అటు థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న ఈ సినిమాలోని సాంగ్స్ సైతం ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా మొదటి రోజే రూ.7 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంచలన నిర్ణయం.. హెచ్‌సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేత
సంచలన నిర్ణయం.. హెచ్‌సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేత
ఆందోళన వద్దు ఆదుకుంటాం.. ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు భరోసా
ఆందోళన వద్దు ఆదుకుంటాం.. ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు భరోసా
పెళ్లిలో చెప్పుల గొడవతో పెళ్లికొడుకును చితకొట్టారు..
పెళ్లిలో చెప్పుల గొడవతో పెళ్లికొడుకును చితకొట్టారు..
రెండేళ్ల నిషేధం తర్వాత నాసిర్ గ్రాండ్ రీ ఎంట్రీ!
రెండేళ్ల నిషేధం తర్వాత నాసిర్ గ్రాండ్ రీ ఎంట్రీ!
జితేష్-దయాల్ క్యాచ్ మిస్.. కోహ్లీ ప్రస్టేషన్ చూడాల్సిందే భయ్యో
జితేష్-దయాల్ క్యాచ్ మిస్.. కోహ్లీ ప్రస్టేషన్ చూడాల్సిందే భయ్యో
ట్రంప్‌ సుంకాలను రద్దు చేస్తున్నారా? వైట్‌ హౌస్‌ ప్రకటన ఏంటి?
ట్రంప్‌ సుంకాలను రద్దు చేస్తున్నారా? వైట్‌ హౌస్‌ ప్రకటన ఏంటి?
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ సరికొత్త రికార్డు.. వాటన్నింటిని దాటి..
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ సరికొత్త రికార్డు.. వాటన్నింటిని దాటి..
ప్లే ఆఫ్స్‌కు దూరంగా 3 జట్లు.. 2వ వారంలోనే చేతులెత్తేశారుగా..
ప్లే ఆఫ్స్‌కు దూరంగా 3 జట్లు.. 2వ వారంలోనే చేతులెత్తేశారుగా..
మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే..
మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే..
IPL 2025: రేపటి మ్యాచ్‌ల్లో గెలిచేది ఏ జట్లంటే?
IPL 2025: రేపటి మ్యాచ్‌ల్లో గెలిచేది ఏ జట్లంటే?