ట్రాన్స్‌జెండర్ అని అవమానించారు.. షోల నుంచి తీశారు.. వాడు మోసం చేశాడు
జబర్దస్త్ షో ద్వారా చాలా మంది క్రేజ్ సొంతం చేసుకున్నారు. అలాగే ఈ కామెడీ షోలో కొంతమంది లేడీ గెటప్స్ లోనూ మెప్పించారు. వారిలో కొంతమంది నిజంగానే అమ్మాయిలుగా మారారు. వారిలో ప్రియాంక సింగ్ ఒకరు అలియాస్ పింకీ. జబర్దస్త్ ద్వారా ప్రియాంక మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

జబర్దస్త్ ద్వారా చాలా మంది కమెడియన్స్ పాపులర్ అయ్యారు. ఎంతో మంది సినిమాల్లోనూ ఛాన్స్ లు అందుకున్నారు. కొందరు దర్శకులుగా.. మరికొందరు హీరోలుగా, కమెడియన్స్ గా రాణిస్తున్నారు. వారిలో ప్రియాంక సింగ్ ఒకరు. లేడీ గెటప్ తో కామెడీ పండించింది ప్రియాంక.. మొదట అబ్బాయిగా ఉన్న ప్రియాంక ఆతర్వాత పూర్తిగా అమ్మాయిగా మారింది. ఇక ఇప్పుడు హీరోయిన్స్ ను తలదన్నే అందంతో ఆకట్టుకుంటుంది. టీవీ షోలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ గేమ్ షోలోనూ పాల్గొంది. బిగ్ బాస్ గేమ్ షోలో తన ఆటతో ఆకట్టుకుంది.
ప్రియాంక సింగ్ ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలోని కొన్ని విషయాలను పంచుకుంది. బిగ్ బాస్ తర్వాత మనసుకు తనకు మధ్య మాటలు తగ్గిపోయాయని, ప్రస్తుతం అసలు టచ్‌లో లేమని తెలిపింది. తన ఫీలింగ్స్ నిజమైనవి అని, తాను ప్రేమించినప్పుడు అలాగే ఉంటానని, అది స్క్రిప్టెడ్ కాదని తెలిపింది. ఆమె జీవితాన్ని ప్రభావితం చేసిన అత్యంత బాధాకరమైన సంఘటన తన మాజీ ప్రియుడితో బ్రేకప్ అని ప్రియాంక తెలిపింది. తన కోసం జీవితాన్ని ఇచ్చేద్దామని అనుకున్నా.. ప్రియుడు పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి మోసం చేశాడని ఆమె తెలిపారు. చాలా పెద్ద పెద్ద డెసిషన్స్ అన్ని తీసుకొని అదంతా అయిన తర్వాత తనకి వేరే అమ్మాయితో పెళ్లి అయిపోయింది ప్రియాంక ఎమోషనల్ అయ్యింది. ఈ మోసం తనను తీవ్ర మనోవేదనకు గురిచేసిందని తెలిపింది.
నేను ఏడ్చి రోడ్ల మీద పిచ్చి కుక్కలా తిరిగినప్పుడు నువ్వు లేవు అంటూ అతడిని నిలదీశానని ప్రియాంక తెలిపింది. బిగ్ బాస్, వ్యక్తిగత జీవితంలో తగిలిన దెబ్బలతో తాను రాయిలా మారిపోయానని ఆమె అన్నారు. చీటింగ్‌ను తాను ఎప్పటికీ తీసుకోలేనని స్పష్టం చేసింది. ట్రాన్స్‌జెండర్ అయిన కారణంగా తాను వృత్తిపరంగా ఎదుర్కొన్న వివక్ష గురించి ప్రియాంక సింగ్ ఆవేదన వ్యక్తం చేసింది. కొందరు టీవీ ఆర్టిస్టులు ఆ అమ్మాయి ఉంటే నేను చేయనండి అని చెప్పి తనను చాలా షోల నుండి తీసివేయించారని తెలిపింది. కొందరు మెల్ యాక్టర్స్ కూడా తనతో నటించడానికి నిరాకరించినట్లు తెలిపారు. సినిమా అవకాశాల విషయంలో కూడా, మీరు ట్రాన్స్ కదండి అంటే లైక్ యు ఆర్ సంథింగ్ కదండి ఇప్పుడు మిమ్మల్ని జనాలు అంటే ఆడియన్స్ లైక్ అమ్మాయిలా మిమ్మల్ని ఎలా చూస్తారు. ప్రియాంక గారు అయితే వద్దులేండి ఈ క్యారెక్టర్ వేరే అమ్మాయిల్ని పెట్టండి అని చెప్పి తనను చాలా షోలు, సినిమాల నుండి తొలగించినట్లు తెలిపారు. ప్రస్తుతం తాను ఒంటరిగా జీవిస్తున్నానని, తన 3 బీహెచ్‌కే ఫ్లాట్‌లో ఒంటరినని ప్రియాంక ఎమోషనల్ అయ్యింది. ప్రేమలో మోసపోయిన వారికి ప్రియాంక ఒక మెసేజ్ ఇచ్చింది. ఎవరినైనా ప్రేమిస్తే కనీసం ఒక సంవత్సరం పాటు సమయం తీసుకొని, ప్రయాణించి, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలని తెలిపింది. తొందరపడి తమను తాము అర్పించుకోకుండా, పరిణతి చెందిన నిర్ణయాలు తీసుకోవాలని, మోసం చేసే వారిని విడిచిపెట్టడమే మంచిదని చెప్పుకొచ్చింది ప్రియాంక.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
