AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త ఏడాది.. కొత్త హీరోయిన్లు.. ఇండస్ట్రీ అంతా కొత్తదనమే

కొత్త ఏడాది.. కొత్త హీరోయిన్లు.. ఇండస్ట్రీ అంతా కొత్తదనమే

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Jan 21, 2026 | 5:13 PM

Share

2026లో టాలీవుడ్‌కు కొత్త గ్లామర్ అద్దేందుకు పలువురు నూతన హీరోయిన్లు సిద్ధమవుతున్నారు. సాత్విక వీరవల్లి 'ఆకాశంలో ఒక తార'తో, ఇమాన్వి ఇస్మాయిల్ 'ఫౌజీ'తో, త్రిప్తి దిమ్రి 'స్పిరిట్'తో పరిచయం కానున్నారు. 'ధురంధర్' ఫేమ్ సారా అర్జున్ 'యుఫోరియా'తో తెలుగు తెరకు వస్తున్నారు. ఈ కొత్త ముద్దుగుమ్మలు తెలుగు సినీ పరిశ్రమకు సరికొత్త ఉత్సాహాన్ని తీసుకురానున్నారు.

కొత్త ఏడాది.. కొత్త హీరోయిన్లతో తెలుగు ఇండస్ట్రీ కళకళలాడుతుంది. ఆల్రెడీ ఉన్న వాళ్లు కొందరు సత్తా చూపిస్తున్నా.. కొత్త ముద్దుగుమ్మలు వచ్చినపుడే కదా ఇండస్ట్రీ కూడా కలర్ ఫుల్‌గా ఉంటుంది. చూస్తుంటే 2026లో చాలా మంది కొత్తమ్మాయిలు టాలీవుడ్‌కు హాయ్ చెప్పేలా ఉన్నారు. మరి వాళ్లెవరు.. ఏయే సినిమాలు చేస్తున్నారో చూద్దామా..? గీతా ఆర్ట్స్, వైయజంతి మూవీస్.. రెండూ లెజెండరీ బ్యానర్లే. ఇందులో ఒక్కదాంట్లో నటించే అవకాశం వస్తేనే అదృష్టం అనుకుంటారు.. అలాంటిది ఈ రెండు బ్యానర్లు కలిసి నిర్మిస్తున్న ఆకాశంలో ఒక తార సినిమాతో డెబ్యూ చేస్తున్నారు సాత్విక వీరవల్లి. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ సాధినేని తెరకెక్కిస్తున్నారు. సాత్విక వీరవల్లి మాత్రమే కాదు.. ఇమాన్వి ఇస్మాయిల్ గురించి కూడా ఇండస్ట్రీలో చర్చ బానే జరుగుతుంది. ప్రభాస్ హీరోగా హను తెరకెక్కిస్తున్న ఫౌజీతో ఈ అమ్మాయి పరిచయం అవుతున్నారు. అలాగే స్పిరిట్‌తో త్రిప్తి దిమ్రి తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. దాంతో పాటు యుఫోరియా సినిమాతో టాలీవుడ్‌లో అడుగేస్తున్నారు ధురంధర్ బ్యూటీ సారా అర్జున్. ధురంధర్‌తో సారా అర్జున్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది.. గుణశేఖర్ యుఫోరియాకు ఈ అమ్మాయి ఇమేజ్ బాగా ప్లస్ అవుతుంది. అలాగే రాజా సాబ్‌తో మాళవిక మోహనన్ తెలుగు తెరకు పరిచయమయ్యారు. నారి నారితో ఏజెంట్ ఫేమ్ సాక్షి వైద్య హిట్ కొట్టారు.. ఈ బ్యూటీకి అవకాశాలు బాగానే వస్తున్నాయిప్పుడు. మొత్తానికి ఇంకొన్నాళ్ళు ఈ కొత్త వాళ్లే స్క్రీన్ మీద కనిపించబోతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Prabhas: ప్రభాస్ ప్లాన్‌కు మైండ్ బ్లాక్.. ఇలాగైతే రికార్డులు కష్టమే

Varun Tej: వరుణ్ తేజ్ పరిస్థితి ఏంటి.. కనకరాజు కరుణిస్తాడా..?

Keerthy Suresh: మరోసారి బాలీవుడ్‌ వైపు చూస్తున్న కీర్తి సురేష్.. అంతలా ఏముంది అక్కడ

Don 3: డాన్‌ -3 విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చిన మేకర్స్

Karthi: అభిమానులకు షాక్ ఇచ్చిన కార్తి.. ఖైదీ 2 ఉన్నట్లా.. లేనట్లా