Hyderabad: మరీ ఇంత దారుణమా.. తిన్న ప్లేటులో చేయి కడిగాడని..
మద్యం మత్తులో ఏమి చేస్తున్నామో అనేది మరిచిపోయి.. కొంతమంది దారుణంగా వ్యవహరిస్తున్నారు.. చిన్న చిన్న విషయాలకే కట్టలు తెంచుకున్న కోపంతో దాడులు చేస్తున్నారు.. మరి కొంతమంది అయితే అత్యంత క్రూరంగా మనుషులను చంపేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

మద్యం మత్తులో ఏమి చేస్తున్నామో అనేది మరిచిపోయి.. కొంతమంది దారుణంగా వ్యవహరిస్తున్నారు.. చిన్న చిన్న విషయాలకే కట్టలు తెంచుకున్న కోపంతో దాడులు చేస్తున్నారు.. మరి కొంతమంది అయితే అత్యంత క్రూరంగా మనుషులను చంపేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే తిన్న ప్లేటులోనే చేయి కడుగుతావా అంటూ ఒక వ్యక్తి మద్యం మత్తులో దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితుడు అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉస్మాన్ నగర్‌లో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. మృతుడు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శామ్ పంచాలగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు అతుల్ సహానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
బాధితుడు శామ్ పంచాల, నిందితుడు అతుల్ సహాని ఒకే గదిలో ఉంటున్నారు. అన్నం తిన్న తర్వాత శామ్ అదే ప్లేటులో చేతి కడిగాడు. ఈ విషయమై మద్యం మత్తులో ఉన్న అతుల్ సహాని వాదనకు దిగాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.. ఒక్కసారిగా తీవ్ర ఆవేశానికి లోనైన అతుల్.. శామ్ పై దాడి చేశాడు.. ప్రెజర్ కుక్కర్ తీసుకొని శామ్ తలమీద బలంగా కొట్టాడు. దీంతో శామ్ అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు.
ఈ ఘటన జరుగుతున్న సమయంలో మరో వ్యక్తి కూడా అక్కడే ఉన్నాడని పోలీసులు గుర్తించారు.. ఏది ఏమైన తిన్న ప్లేట్ లో చేయి కడిగితే చంపడం ఏంటి అని అందరు ఆశ్చర్య పోతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
