Kevvu Karthik: కెవ్వు కార్తీక్ భార్యని చూశారా..? హీరోయిన్స్ కూడా సరితూగరు

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లలో కెవ్వు కార్తిక్ ఒకడు. ప్రస్తుతం అతను సినిమాల్లోనూ నటిస్తున్నాడు. కాగా కార్తీక్ ఇటీవల తన భార్యతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అవి వైరల్‌గా మారాయి..

Kevvu Karthik: కెవ్వు కార్తీక్ భార్యని చూశారా..? హీరోయిన్స్ కూడా సరితూగరు
Kevvu Karthik
Follow us

|

Updated on: Jun 27, 2024 | 5:59 PM

జబర్దస్త్ చాలామంది ఆర్టిస్టులకు ఫేమ్‌ను, నేమ్‌ను తెచ్చిందన్న విషయం తెలిసిందే. ఈ షో ప్రొడ్యూస్ చేసిన కమెడియన్లలో  కెవ్వు కార్తిక్ ఒకడు. వందల సంఖ్యలో వినూత్నమైన స్కిట్స్‌తో అతను వీక్షకులను ఆకట్టకున్నాడు.  జబర్దస్త్‌ మాత్రమే కాకుండా పలు స్టేజ్ షోలు, ఈవెంట్లలో తన టాలెంట్‌తో జనాల్లో మంచి గుర్తింపుతెచ్చుకున్నాడు కార్తిక్. పలు సినిమాల్లో కూడా నటించి.. యాక్టర్‌గా తన ప్రతిభ చూపిస్తున్నాడు. చెప్పడం మర్చిపోయాం.. కార్తీక్ మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా. ఇకపోతే  కార్తీక్ మంచి కమెడియన్ మాత్రమే కాదు మంచి తనయుడు కూడా. క్యాన్సర్‌తో పోరాడుతున్న తల్లిని కాపాడుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. 5 సంవత్సరాల పాటు ఓ యుద్దమే చేశాడు. వ్యయప్రసాలకోర్చి ట్రీట్మెంట్ అందించాడు. కనిపించిన ప్రతి దేవుడ్ని మొక్కాడు. ఇటీవలే అతని తల్లి కన్నుమూశారు.

కెవ్వు కార్తీక్ గత ఏడాది జూన్‌లో.. శ్రీలేఖను పెళ్లాడాడు. అప్పట్లో చాలామంది కమెడియన్లు నటీనటులు ఇతని పెళ్లికి హాజరయ్యారు. కాగా కార్తీక్ ఇటీవల తన భార్యతో కలిసి ఉన్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికల్లో షేర్ చేస్తున్నారు. వాటి కింద నెటిజన్లు క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. కొందరు క్యూట్ కపుల్ అని పేర్కొంటూ ఉండగా.. మరికొందరు బ్రదర్ మీ వైఫ్ హీరోయినా అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు నీ భార్య హీరోయిన్ల కంటే చాలా అందంగా ఉంది.. లక్కీ ఫెల్లో అని పేర్కొంటున్నారు. మొత్తం ఈ జబర్దస్త్ కపుల్ ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.