Auto Ramprasad: క్యాన్సర్ బారిన పడిన ఆటో రాంప్రసాద్ !! క్లారిటీ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్
సుడిగాలి సుధీర్ జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడంతో ప్రస్తుతం గెటప్ శ్రీనుతో కలిసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు రాం ప్రసాద్. కాగా ఇటీవల ఈ స్టార్ కమెడియన్‌పై కొన్ని పుకార్లు హల్‌చల్ చేస్తున్నాయి. రాంప్రసాద్ అనారోగ్యం బారిన పడ్డారంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి.

జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న వారిలో ఆటో రాం ప్రసాద్ ఒకరు. ఆటో పంచులకు కేరాఫ్ అడ్రస్ అయిన అతను సుధీర్, గెటప్ శ్రీనులతో కలిసి స్కిట్లు చేస్తుంటాడు. జబర్దస్త్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ వీరు ముగ్గురూ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. అయితే సుడిగాలి సుధీర్ జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడంతో ప్రస్తుతం గెటప్ శ్రీనుతో కలిసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు రాం ప్రసాద్. కాగా ఇటీవల ఈ స్టార్ కమెడియన్‌పై కొన్ని పుకార్లు హల్‌చల్ చేస్తున్నాయి. రాంప్రసాద్ అనారోగ్యం బారిన పడ్డారంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. తలకు సర్జరీ జరిగిందని నెట్టింట పుకార్లు హల్‌చల్ చేశాయి. దీనికి తోడు జబర్దస్త్ వేదికపైనా, బయటా క్యాప్ పెట్టుకొని కనిపించడంతో రాంప్రసాద్ కి క్యాన్సర్ అంటూ కథనాలు బయటికు వచ్చేశాయి. వీటికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిని చూసిన వారంతా రాంప్రసాద్ కి నిజంగానే క్యాన్సర్ వచ్చిందా? అన్న అనుమానాలు తలెత్తాయి. అయితే ఈ పుకార్లు స్టార్ కమెడియన్ దగ్గరకూ చేరాయి. వీటిపై స్పందించిన అతను తన హెల్త్ కండీషన్‌పై క్లారిటీ ఇచ్చాడు.
తాజాగా కిర్రాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు సెకెండ్ బ్రాంచ్‌ను ప్రారంభించాడు. మణికొండలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆటో రాం ప్రసాద్‌తో పాటు పలువురు జబర్దస్త్ కమెడియన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆటో రాం ప్రసాద్ తనపై వస్తోన్న క్యాన్సర్ పుకార్లపై స్పందించాడు. ‘ కొద్దిరోజులుగా నా ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలలో ఎలాంటి వాస్తవం లేదు. తలకు క్యాప్ పెట్టుకొని కనిపించేసరికి నాకేదో అయ్యిందని.. క్యాన్సర్ అంటూ కథనాలు అల్లుకొస్తున్నారు. కొద్ది రోజుల క్రితం నేను హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నా. అందుకనే క్యాప్ పెట్టుకున్నా. అంతేకానీ అంతకుమించి ఆరోగ్య సమస్యలేవీ లేవు. నాకేదైనా అయితే మీరు ఉన్నారుగా చూసుకోవడానికి. దయచేసి అసత్య వార్తలను రాయకండి’ అంటూ తనపై వస్తోన్న పుకార్లను కొట్టిపారేశాడీ స్టార్ కమెడియన్.




View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..




