S. S. Rajamouli: జక్కన్న పై మరో హాలీవుడ్ దిగ్గజ దర్శకుడి ప్రశంసలు.. స్పిల్ బర్గ్‌తో రాజమౌళి లైవ్ చాట్

ఇక ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..ఎన్నో రికార్డులు కొల్లగొట్టింది ఈ మూవీ. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో సత్తా చాటింది మన సినిమా.

S. S. Rajamouli: జక్కన్న పై మరో హాలీవుడ్ దిగ్గజ దర్శకుడి ప్రశంసలు.. స్పిల్ బర్గ్‌తో రాజమౌళి లైవ్ చాట్
Rajamouli, Steven Steel Bar
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 11, 2023 | 7:13 AM

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఎలుగెత్తి చాటారు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. బాహుబలి సినిమాతోనే తెలుగు సినిమా గురించి ప్రతిఒక్కరు మాట్లాడుకునేలా చేసిన రాజమౌళి.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ సత్తా ఏంటో మరోసారి అందరికి తెలిసేలా చేశారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..ఎన్నో రికార్డులు కొల్లగొట్టింది ఈ మూవీ. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో సత్తా చాటింది మన సినిమా. లాస్‌ ఏంజిల్స్‌లో జరిగిన ప్రతిష్టాత్మక గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల్లో..నాటు నాటు సాంగ్‌ అవార్డ్‌ను సొంతం చేసుకుంది. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో నాటు నాటు..బెస్ట్‌ సాంగ్‌ అవార్డ్‌ దక్కించుకుంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీరవాణి..అతిరథ మహారథుల మధ్య గోల్డెన్‌ గ్లోబ్ అవార్డును అందుకున్నారు. అలాగే ఆస్కార్ రేస్ లోకి కూడా పాట అడుగుపెట్టింది.

ఇటీవల అనౌన్స్ చేసిన ఆస్కార్ నామినేషన్స్ లో నాటు నాటు పాట చోటు దక్కించుకుంది . ఈ పాటలో రామచరణ్, జూనియర్ ఎన్టీఆర్‌ స్టెప్పులు ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే జక్కన్న పై హాలీవుడ్ దర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మొన్నామధ్య దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ జక్కన పై పొగడ్తల వర్షం కురిపించారు. ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతగానో నచ్చిందని.. మరోసారి కూడా చూస్తానంటూ రాజమౌళితో చెప్పారు జేమ్స్.

తాజాగా మరో దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పిల్ బర్గ్ కూడా రాజమౌళి పై ప్రశంసలు కురిపించారు. దాంతో జక్కన్న ఉబ్బి తబిపోతున్నారు.  స్పిల్బర్గ్ తో రాజమౌళి ఆన్ లైన్ లో మాట్లాడారు. ఇది రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ యుట్యూబ్ చానల్ లో ఈ లైవ్ స్ట్రీమింగ్ కాబోతుంది. స్పిల్ బర్గ్ తన కొత్త సినిమా ఫెబిల్ మెన్ రిలీజ్ సందర్భంగా రాజమౌళితో ప్రత్యేకంగా యుట్యూబ్ లో మాట్లాడారు. ఇక స్పిల్ బర్గ్ తనతో మాట్లాడతంతో జక్కన్న ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.