Yogi Babu: యోగిబాబు రెమ్యునరేషన్ తెలిస్తే దిమ్మతిరిగి బొమ్మ కనిపిస్తుంది.. ఓ స్టార్ హీరో రేంజ్‌లో అందుకుంటున్నాడుగా..
స్టార్ హీరోల సినిమాల్లో యోగిబాబు పక్కగా ఉంటారు. ఆయన కోసమే కథలో ఓ కామెడీ ట్రాక్ ను రాస్తుంటారు దర్శకులు. దళపతి విజయ్ నటిస్తున్న సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తుంటారు యోగిబాబు. ఇదిలా ఉంటే యోగిబాబు అందుకుంటున్న రెమ్యునరేషన్ గురించి తెలిస్తే షాక్ అవుతారు.
ప్రతిభగల నటులు ఎంతో మంది మన ఇండస్ట్రీలో ఉన్నారు. అలాంటి వారిలో యోగిబాబు ఒకరు. స్టార్ కమెడియన్ గా తమిళ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు యోగిబాబు. స్టార్ హీరోల సినిమాల్లో యోగిబాబు పక్కగా ఉంటారు. ఆయన కోసమే కథలో ఓ కామెడీ ట్రాక్ ను రాస్తుంటారు దర్శకులు. దళపతి విజయ్ నటిస్తున్న సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తుంటారు యోగిబాబు. ఇదిలా ఉంటే యోగిబాబు అందుకుంటున్న రెమ్యునరేషన్ గురించి తెలిస్తే షాక్ అవుతారు. ఈ స్టార్ కమెడియన్ 2009లో వచ్చిన యోగి సినిమాతో పరిచయం అయ్యారు. ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాయి. ముఖ్యంగా శివకార్తికేయన్ హీరోగా నటించిన డాక్టర్ వరుణ్ సినిమాతో బాగా దగ్గరయ్యారు. ఆ సినిమాలో ఆయన చేసిన కామెడీ థియేటర్స్ లో నవ్వులు పూయించాయి.
అలాగే రీసెంట్ గా వచ్చిన లవ్ టుడే సినిమాలో ఆయన పండించిన కామెడీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు యోగిబాబు అందుకుంటున్న రెమ్యునరేషన్ అందరిని అవాక్ అయ్యేలా చేస్తోంది. కొంతమంది హీరోలు అందుకునే రెమ్యునరేషన్ తో సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు యోగిబాబు.
యోగిబాబు ఒకొక్క సినిమాకు కోట్లల్లో అందుకుంటున్నారని తెలుస్తోంది. యోగిబాబు ఒకొక్క రోజుకు 18 లక్షల వరకు అందుకుంటున్నారని తెలుస్తోంది. కోలీవుడ్ నుంచి వినిపిస్తున్న టాక్ ప్రకారం. రోజు 18 లక్షలు అందుకుంటూ సినిమా దాదాపు 10 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ రేంజ్ రెమ్యునరేషన్ కోలీవుడ్ లో కొంతమంది హీరోలకు సమానం అని అంటున్నారు.