Ram Charan: చరణ్ ఫ్యాన్స్‌కు కొత్త టెన్షన్.? గేమ్ చేంజర్‌ నుంచి ఆ బ్యూటీ తప్పుకుంటుందా.?

ఈ జనరేషన్‌ హీరోయిన్లు పర్సనల్‌ లైఫ్‌ను ప్రొఫెషనల్ కెరీర్‌ను చాలా బాగా బ్యాలెన్స్ చేస్తున్నారు. కెరీర్‌ ఫామ్‌లో ఉన్న టైమ్‌లోనే పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతున్నారు.

Follow us
Ravi Kiran

|

Updated on: Jun 30, 2023 | 12:08 PM

ఈ జనరేషన్‌ హీరోయిన్లు పర్సనల్‌ లైఫ్‌ను ప్రొఫెషనల్ కెరీర్‌ను చాలా బాగా బ్యాలెన్స్ చేస్తున్నారు. కెరీర్‌ ఫామ్‌లో ఉన్న టైమ్‌లోనే పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతున్నారు. పెళ్లి తరువాత కూడా గ్లామర్‌ వరల్డ్‌లో కంటిన్యూ అవుతున్నారు. అయితే రీసెంట్‌గా అలా పెళ్లి బంధంలో అడుగుపెట్టిన ఓ బ్యూటీ… సెట్స్ మీద ఉన్న సినిమాలకు షాక్ ఇవ్వబోతున్నారా..? అన్న అనుమానాలు మొదలయ్యాయి. రీసెంట్‌గా ఫాదర్‌ పోస్ట్‌కు ప్రమోట్‌ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. దీంతో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ షూటింగ్‌కు బ్రేక్ పడింది. తాజాగా ఈ మూవీ షూట్ మరింత డీలే అయ్యే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది.

బాలీవుడ్‌లో మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్‌ సిద్‌, కియారా. చాలా కాలం ప్రేమలో ఉండి, రీసెంట్‌గా పెళ్లి చేసుకున్న ఈ జంట షార్ట్ గ్యాప్‌ తీసుకొని మళ్లీ షూటింగ్స్‌లో బిజీ అయ్యారు. ఇద్దరి చేతిలో వరుస ప్రాజెక్ట్స్ ఉండటంతో కెరీర్ మీదే సీరియస్‌గా ఫోకస్ పెట్టారు. కానీ తాజాగా కియారా విషయంలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. కియారా అద్వానీ తల్లి కాబోతున్నారన్న న్యూస్ బాలీవుడ్ సర్కిల్స్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. దీంతో ఈ బ్యూటీ చేతిలో ఉన్న సినిమాల విషయంలో టెన్షన్ మొదలైంది. సాధారణంగా హీరోయిన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫార్మ్ అయినా… చేతిలో ఉన్న సినిమాలు కంప్లీట్ చేశాకే బ్రేక్ తీసుకుంటారు. కియారా కూడా అదే ప్లాన్‌లో ఉన్నారు.

కానీ గేమ్ చేంజర్‌ విషయంలో కియారా ప్లాన్ వర్కవుట్ అయ్యేలా లేదు. ప్రజెంట్ రామ్ చరణ్ బ్రేక్‌లో ఉన్నారు. చెర్రీ బ్రేక్‌ ఇవ్వటంతో శంకర్‌ కూడా ఇండియన్‌ 2 ప్రాజెక్ట్‌కి షిఫ్ట్ అయ్యారు. అది పూర్తయితే గానీ గేమ్‌ చేంజర్ వర్క్‌ రీ స్టార్ట్ చేసే పరిస్థితి లేదు. మరి అప్పటికి కియారా షూటింగ్ చేసేందుకు ఓకే చెబుతారా..? ఈ విషయంలోనే ఇప్పుడు సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఇంతవరకు కియారా ప్రెగ్నెన్సీకి సంబంధించి అఫీషియల్ న్యూస్ ఏది రాకపోయినా… ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

(టీవీ9 ఎంటర్టైన్మెంట్ డెస్క్)