Vijay Deverakonda: మరో టాలెంటెడ్ డైరెక్టర్‌కు రౌడీ బాయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా..?
అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్. ఆ తర్వాత గీతగోవిందం సినిమాలో తన మార్క్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు రీసెంట్ గా డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ యంగ్ హీరో తన యాటిట్యూడ్ తో అంతులేని అభిమానులను సొంతం చేసుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్. ఆ తర్వాత గీతగోవిందం సినిమాలో తన మార్క్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు రీసెంట్ గా డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషీ అనే సినిమా చేస్తున్నాడు విజయ్. అందమైన ప్రేమ కథగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ తో జరుగుతోంది. ఈ సినిమాను డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని ముందే ప్రకటించారు మేకర్స్. కాశ్మీర్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు దర్శకుడు శివ నిర్వాణ. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మోషన్ పోస్టర్ సినిమా పై ఆసక్తిని క్రియేట్ చేసింది.
ఇదిలా ఉంటే విజయ్ ఇప్పుడు మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వినిపిస్తోంది. జర్సీ సినిమాతో గౌతమ్ తిన్ననూరి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేయాలని చూస్తున్నాడు. చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ఆర్సీ15 చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత గౌతమ్ తో సినిమా చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు అదే సినిమాను విజయ్ తో చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. చరణ్, గౌతమ్ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించబోతున్నట్టు కూడా ప్రకటించారు. కానీ ఈ ప్రాజెక్టుని చరణ్ పక్కన పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఇదే కథను ఇప్పుడు విజయ్ చేయనున్నాడట మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.