Devi Sri Prasad: దేవీతో మైత్రి మూవీ మేకర్స్‌కు సంథింగ్ సంథింగ్..!

మామూలుగా దేవి శ్రీ ప్రసాద్ పేరు కేవలం సినిమా పోస్టర్లపై కనిపిస్తుంది. ఆయన పాటలు మాత్రమే వినిపిస్తుంటాయి. ఆయన మాత్రం చాలా సైలెంట్‌గా ఉంటాడు. ఎప్పుడు తన మ్యూజిక్.. తన లోకం అన్నట్టుంటాడు దేవి శ్రీ ప్రసాద్.

Devi Sri Prasad: దేవీతో మైత్రి మూవీ మేకర్స్‌కు సంథింగ్ సంథింగ్..!
Devi Sri Prasad
Follow us
Praveen Vadla

| Edited By: Ravi Kiran

Updated on: Nov 29, 2024 | 7:23 AM

మామూలుగా దేవి శ్రీ ప్రసాద్ పేరు కేవలం సినిమా పోస్టర్లపై కనిపిస్తుంది. ఆయన పాటలు మాత్రమే వినిపిస్తుంటాయి. ఆయన మాత్రం చాలా సైలెంట్‌గా ఉంటాడు. ఎప్పుడు తన మ్యూజిక్.. తన లోకం అన్నట్టుంటాడు దేవి శ్రీ ప్రసాద్. అలాంటి డిఎస్పి పేరు ఈ మధ్య వివాదాల్లో కూడా వినిపిస్తుంది. మరీ ముఖ్యంగా పుష్ప 2 సినిమా కోసం నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేశారని మైత్రి మూవీ మేకర్స్ నేరుగా చెప్పడంతో అసలు సమస్య మొదలైంది. అసలు దేవి శ్రీ ప్రసాద్ ఉండంగా ఎంత మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఎందుకు పని చేస్తున్నారనే అనుమానాలు అందరిలోనూ మొదలయ్యాయి. దానికి దేవీ నుంచి కూడా సరైన సమాధానం రాలేదు. ఆయన ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ సుకుమార్‌కు నచ్చలేదని.. అందుకే తమన్ సహా మరో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లతో రీ రికార్డింగ్ ఇప్పించాడని న్యూస్ బయటకు వచ్చింది. తమన్ కూడా తను పుష్ప 2కు పని చేసినట్లు కన్ఫర్మ్ చేశాడు. తనకు కేవలం పది రోజుల్లో సినిమా అంతా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వాలని దర్శక నిర్మాతలు కోరారని.. అయితే తను కేవలం ఫస్టాఫ్ మాత్రమే చేసి ఇచ్చానని చెప్పాడు తమన్.

మరోవైపు దేవి శ్రీ ప్రసాద్ మాత్రం సినిమాలో తను చేసిన మ్యూజిక్ ఉంటుందని.. ప్రొడ్యూసర్ల నుంచి డబ్బులు అయినా.. సినిమాలో తనకు రావాల్సిన క్రెడిట్ అయినా కచ్చితంగా అడిగి తీసుకోవాల్సిందే అంటూ మొన్న చెన్నై ఈవెంట్లో గట్టిగానే చెప్పాడు. దాంతో దేవీ, మైత్రి మూవీ మేకర్స్ మధ్య ఏదో రగడ నడుస్తుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇదే విషయంపై మైత్రి మూవీ మేకర్స్ రవిశంకర్ కూడా క్లారిటీ ఇచ్చాడు. దేవి శ్రీ ప్రసాద్‌తో తమకు ఎలాంటి సమస్య లేదని.. అనవసరంగా సోషల్ మీడియాలో ఉన్నవి లేనివి రాసి తమ మధ్య లేని గ్యాప్ క్రియేట్ చేయొద్దు అన్నాడు. అయితే తాజాగా మరో విషయం బయటకు వచ్చింది. అజిత్ హీరోగా ఆదిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. అయితే దీనికి కూడా కేవలం పాటలు వరకు మాత్రమే మ్యూజిక్ ఇస్తున్నాడు దేవి. జీవి ప్రకాష్ కుమార్‌తో రీ రికార్డింగ్ చేయించుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియాలో జీవి ప్రకాష్ చెప్పకనే చెప్పాడు. అయితే వరుసగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమాల నుంచి దేవి శ్రీ ప్రసాద్ సైడ్ అవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు.

దేవీని మైత్రి పక్కన పెడుతుందో లేదంటే మైత్రిని దేవి పక్కన పెడుతున్నాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఏది ఏమైనా వాళ్ళ సినిమాలకు దేవి పూర్తి స్థాయిలో సంగీతం అందించడం లేదనే విషయం మాత్రం అర్థమవుతుంది. పుష్ప 2 అంటే చాలా బిజీగా ఉన్నాడు కాబట్టి ఇంకో మ్యూజిక్ డైరెక్టర్‌ను చూసుకున్నారు అనుకోవచ్చు. కానీ అజిత్ సినిమాకు అలాంటి డెడ్ లైన్ ఏమీ లేదు. అయినా కూడా దేవి దీనికి పని చేయట్లేదు. మరి దీనికి మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వామ్మో.. రూ.కోట్లు సంపాదించి పెడుతున్న రావిచెట్టు.!వీడియో.
వామ్మో.. రూ.కోట్లు సంపాదించి పెడుతున్న రావిచెట్టు.!వీడియో.
వింత ఆచారం.. ఇంటింటా సేకరించిన అన్నాన్ని రాశిగా పోసి.. వీడియో.
వింత ఆచారం.. ఇంటింటా సేకరించిన అన్నాన్ని రాశిగా పోసి.. వీడియో.
ఆసుపత్రిలో మనోజ్! మంచు కుటుంబంలో తుఫాన్.మోహన్‌బాబు తనను కొట్టారని
ఆసుపత్రిలో మనోజ్! మంచు కుటుంబంలో తుఫాన్.మోహన్‌బాబు తనను కొట్టారని
కాంగ్రెస్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
కాంగ్రెస్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
హీరోయిన్ తో టాలీవుడ్ డైరెక్టర్ పెళ్లి.! తిరుమల సన్నిదిలో వివాహం..
హీరోయిన్ తో టాలీవుడ్ డైరెక్టర్ పెళ్లి.! తిరుమల సన్నిదిలో వివాహం..
భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 ఓ విస్పోటనం.! రుహానీశర్మ కామెంట్స్
భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 ఓ విస్పోటనం.! రుహానీశర్మ కామెంట్స్
నన్ను అర్థం చేసుకోవడం కష్టం.. వారికైతే మరీ కష్టం! ధనుష్ కామెంట్స్
నన్ను అర్థం చేసుకోవడం కష్టం.. వారికైతే మరీ కష్టం! ధనుష్ కామెంట్స్
కలుస్తూ.. విడిపోతూ.. సీరియల్‌లా సాగుతోంది వీరి జీవితం.! వీడియో..
కలుస్తూ.. విడిపోతూ.. సీరియల్‌లా సాగుతోంది వీరి జీవితం.! వీడియో..
అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కాంట్రవర్సీ లేకపోతే ఆర్జీవీ ఎలా
అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కాంట్రవర్సీ లేకపోతే ఆర్జీవీ ఎలా
బన్నీ పై ప్రకాశ్ రాజ్‌ ట్వీట్.. గంగోత్రి నుండి చూస్తున్నా అంటూ..
బన్నీ పై ప్రకాశ్ రాజ్‌ ట్వీట్.. గంగోత్రి నుండి చూస్తున్నా అంటూ..