Hanu Raghavapudi: సీతారామం దర్శకుడు నెక్స్ట్ ఆ స్టార్ హీరోతో సినిమా చేయనున్నాడా.?
తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయాడు. అయితే సాలిడ్ సక్సెస్ మాత్రం సీతారామం సినిమాతోనే అందుకున్నాడు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది.
ఈ మధ్య కాలంలో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో సీతారామం సినిమా ఒకటి ఈ సినిమా అందమైన ప్రేమ కథగా వచ్చి సూపర్ హిట్ ను అందుకుంది. యుద్ధం నేపథ్యంలో సాగే ప్రేమ కథను చాలా చక్కగా తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు హను రాఘవపూడి. అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు హను. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయాడు. అయితే సాలిడ్ సక్సెస్ మాత్రం సీతారామం సినిమాతోనే అందుకున్నాడు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. ఈ సినిమా పప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో దుల్కర్, మృణాల్ తమ నటనతో కటిపడేశారు. అలాగే సీతారామం సినిమాలో రష్మిక మందన్న కీలక పాత్రలో నటించి మెప్పించింది.
ఇక ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నెస్ట్ ఎవరితో సినిమా చేస్తున్నాడన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ క్రమంలో హను రాఘవపూడి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న తారక్. ఇప్పుడు కొరటాల సినిమాతో మరో హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
అయితే కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కు సంబంధించిన ప్రీ లుక్ కూడా రిలీజ్ చేశారు. అలాగే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో కూడా తారక్ ఓ సినిమా చేయనున్నాడు. అయితే బుచ్చిబాబు సినిమా ఇంకా కన్ఫామ్ కాలేదు. తారక్ డేట్స్ దొరక్కపోతే చరణ్ తో సినిమా చేయాలనీ చూస్తున్నాడు బుచ్చిబాబు. అయితే ఈ సినిమా తర్వాత హను రాఘవాపుడితో తారక్ సినిమా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే తారక్ కోసం ఓ సాలిడ్ స్టోరీని కూడా రెడీ చేశారట సీతారామం దర్శకుడు. అయితే ఈ వార్తల్లో వాస్తవమెంత..? ఇది యాక్షన్ ఎంటర్టైనరా..? లేక లవ్ స్టోరీనా.? అన్నది తెలియాల్సి ఉంది.