Naga Chaitanya: హిట్ ఇచ్చిన దర్శకుడితో మరోసారి అక్కినేని యంగ్ హీరో.. ఆ దర్శకుడు ఎవరంటే
ఇటీవలే థ్యాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు చైతూ.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ప్రస్తుతం చైతూ ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.
అక్కినేని కుర్ర హీరో నాగచైతన్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇటీవలే థ్యాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు చైతూ.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ప్రస్తుతం చైతూ ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. దూత అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సిరీస్ కు కూడా విక్రమ్ కుమార్ నే దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే కస్టడీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే నాగచైతన్య మరో సినిమాకు కమిట్ అయ్యాడని తెలుస్తోంది. తనకు సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడితోనే ఈ కుర్ర హీరో మరోసారి కలిసి పని చేయనున్నాడని తెలుస్తోంది. ఇంతకు ఆ దర్శకుడు ఎవరో తెలుసా..
టాలీవుడ్ లో సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్నాడు శేఖర్ కమ్ముల. అందమైన ప్రేమ కథలు తెరకెక్కించడంతో శేఖర్ కమ్ములది డిఫరెంట్ స్టైల్. మన నేటివిటీకి దగ్గర ఉండే కథలతో ప్రేక్షకులను మెప్పించారు ఈ టాలెంటెడ్ డైరెక్టర్.
నాగచైతన్యతో కలిసి లవ్ స్టోరీ అనే సినిమా తెరకెక్కించాడు శేఖర్ కమ్ముల. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నాగచైతన్య తెలంగాణ కుర్రాడిగా నటించి ఆకట్టుకున్నాడు. నాగచైతన్య నటనతో పాటు డాన్స్ లతో కూడా ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరోసారి సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.