Jr NTR: తారక్ సినిమా కోసం ఆ అందాల భామను ఎంపిక చేశారా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు . ఆర్ఆర్ఆర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న తారక్.. నెక్స్ట్ మూవీ కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్నాడు.

Jr NTR: తారక్ సినిమా కోసం ఆ అందాల భామను ఎంపిక చేశారా..?
Ntr
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 17, 2022 | 6:32 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు . ఆర్ఆర్ఆర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న తారక్.. నెక్స్ట్ మూవీ కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమా ఇది. ఆచార్య సినిమాతో ఇటీవల్ మొదటి ఫ్లాప్ అందుకున్నాడు కొరటాల. దాంతో తారక్ సినిమా పై మరింత ఫోకస్ పెట్టాడు. ఓ పవర్ఫుల్ కథతో తారక్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు కొరటాల. ఇప్పటికే ఈ సినిమానుంచి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఓ పవర్ ఫుల్ డైలాగ్ తో తమ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు కొరటాల, తారక్. దాంతో ఈ మూవీ పై నందమూరి ఫ్యాన్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది మాత్రం ఇంట్రెస్టింగ్‌గా మారింది.

ఈ సినిమాలో ముందుగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారన్న టాక్ గట్టిగా వినిపించింది. అయితే తనకు తారక్ సినిమా ఛాన్స్ రాలేదని క్లారిటీ ఇచ్చింది జాన్వీ. ఇక ఇప్పుడు మరో ఇద్దరు ముద్దుగుమ్మల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో  మృణాల్ ఠాకూర్ నటించే ఛాన్స్ ఉందని టాక్. ఇటీవలే ముద్దుగుమ్మ సీతారామం సినిమాలో నటించిన విషయం తెలిసిందే. సీతారామం సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తెలుగులో ఒక్క సినిమాతో భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుంది మృణాల్ ఠాకూర్. ఇప్పుడు ఈ అమ్మడికి తెలుగులో ఆఫర్లు క్యూ కడుతున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తారక్ సినిమాలో ఛాన్స్ వచ్చిందని అంటున్నారు. అలాగే మరో హీరోయిన్ గా లక్కీ బ్యూటీ రష్మికను ఎంపిక చేశారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు