Pooja Hegde: బంపర్ ఆఫర్ కొట్టేసిన బుట్టబొమ్మ.. ఆ పాన్ ఇండియా స్టార్ సరసన ఛాన్స్
ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు పూజాహెగ్డే(Pooja Hegde). బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్న పూజాహెగ్డే.. తెలుగు, తమిళ్ హిందీ భాషలను చుట్టేస్తోంది.
ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు పూజాహెగ్డే(Pooja Hegde). బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్న పూజాహెగ్డే.. తెలుగు, తమిళ్ హిందీ భాషలను చుట్టేస్తోంది. భారీ సినిమాల్లో నటిస్తూ కెరీర్ లో దూసుకుపోతోంది. సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా ఈ పొడుగుకాళ్ల సుందరికి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇటీవలే తమిళ్ లో దళపతి విజయ్ నటించిన బీస్ట్ సినిమాలో నటించింది. ఇప్పుడు తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రానున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది పూజ. అలాగే తమిళ్ లోనూ ఈ చిన్నదానికి క్రేజీ ఆఫర్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు మరో బంపర్ ఆఫర్ అనుకుందని తెలుస్తోంది.
కేజీఎఫ్ సినిమాతో తన సత్తా ఎంతో చూపించాడు హీరో యష్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి సంచలన విజయాన్ని అందుకుంది. అలాగే రీసెంట్ గా వచ్చిన కేజీఎఫ్2 కూడా భారీ విజయాన్ని అందుకుంది. దాంతో యష్ తో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో యష్ మఫ్టీ ఫేం నార్తన్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పిరియాడికల్ డ్రామా గా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తోంది. పూజకు ఉన్న క్రేజ్ తెలిసి ఈ సినిమాకు ఆమెనే కరెక్ట్ అని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..