Childhood Photo: తాత ఒడిలో గారాలు పోతున్న ఈ నందమూరి అందగాడు.. నేడు టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా..
తెలుగు సుప్రసిద్ధ నటుడు, రాజకీయ నాయకుడు స్వర్గీయ ఎన్టీఆర్ ఒడిలో కూర్చుకున్న ఓ యువకుడు.. నందమూరి వారసుడు. మరి ఎవరో ఆ ముద్దుల మనవడు గుర్తు పట్టారా..!
Childhood Photo: చిన్న తనంలోని ఫోటోలు, జ్ఞాపకాలు ఎవరికైనా పదిలమే.. ముఖ్యంగా చిన్నతనంలో అమ్మమ్మ, నానమ్మ తాతయ్యలతో గడిపిన క్షణాలు.. వారితో అనుబంధాన్నీ గుర్తు చేసేవి వారితో ఉన్న ఫోటోలు. ఆ జ్ఞాపకాలు, ఫోటోలు సామాన్యులకైనా, సెలబ్రెటీల కైనా పదిలమే.. ఈ నేపథ్యంలో ఒక అరుదైన ఫోటోని మీ ముందుకు తీసుకొచ్చాము ఈ రోజు. తెలుగు సుప్రసిద్ధ నటుడు, రాజకీయ నాయకుడు స్వర్గీయ ఎన్టీఆర్ ఒడిలో కూర్చుకున్న ఓ యువకుడు.. నందమూరి వారసుడు. మరి ఎవరో ఆ ముద్దుల మనవడు గుర్తు పట్టారా..!
తాత ఎన్టీఆర్ తో ఉన్న మనవడు.. ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ కుమారుడు. తారక్ గా పిలుచుకునే యంగ్ టైగర్ ఎన్టీఆర్.. చిన్నతనంలో తాత ఎన్టీఆర్ దగ్గర ఉన్న ఫోటో. నందమూరి హరికృష్ణ, షాలిని దంపతులకు మే 20, 1983 న జన్మించాడు. ఎన్టీఆర్ మంచి డ్యాన్సర్, క్రీడాకారుడు, నటుడు సింగర్. ఎన్టీఆర్ చిన్నతనంలో కూచి పూడి నాట్య ప్రదర్శనలు ఇచ్చాడు. బాల నటుడిగా తాత ఎన్టీఆర్ తో బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో వెండి తెరకు పరిచయం అయ్యాడు.
గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన బలరామాయణం సినిమాలో రాముడిగా నటించి తాతకు తగ్గ మనవడిగా విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. ఎన్.జె. భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్న ఎన్టీఆర్.. నిన్ను చూడాలని సినిమాతో హీరోగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో మొదటి సూపర్ హిట్ ను అందుకున్నాడు. ఆది, సింహాద్రి వంటి సూపర్ హిట్ సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు. ఎస్. ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్ తో మల్టీస్టారర్ చిత్రం ఆర్. ఆర్. ఆర్. లో కొమరం భీమ్ గా నటించి మెప్పించాడు. నందమూరి అభిమానులకు జూ. ఎన్టీఆర్ అంటే ప్రాణం.
ప్రణతిని పెళ్లి చేసుకున్న జూ ఎన్టీఆర్ కు ఇద్దరు కుమారులు.. అటు వృత్తి పరమైన సక్సెస్ తో పాటు.. ఇటు ఫ్యామిలీ పరమైన జీవితంలో సంతోషంగా జీవిస్తున్నారు ఎన్టీఆర్.
మరిన్నిఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..