AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ananya Panday: కేకేఆర్ పార్టీలో ‘లైగర్’ బ్యూటీ.. షారుఖ్ సాంగ్‌కు ఆండ్రీ రస్సెల్‌తో కలిసి స్టెప్పులు.. వీడియో చూశారా?

సుమారు 10 ఏళ్ల తర్వాత కేకేఆర్ జట్టు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. దీంతో ఆ జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. కోల్‌క‌తా ఫ్రాంచైజీ య‌జ‌మాని షారుఖ్ ఖాన్ ఈ విన్నింగ్ సెల‌బ్రేష‌న్స్‌ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లారు. కేకేఆర్ ప్లేయర్లు, సిబ్బంది, ఇతర ప్రముఖుల కోసం ప్ర‌త్యేకంగా డిన్న‌ర్ ఏర్పాటు చేశారు.

Ananya Panday: కేకేఆర్ పార్టీలో 'లైగర్' బ్యూటీ.. షారుఖ్ సాంగ్‌కు ఆండ్రీ రస్సెల్‌తో కలిసి స్టెప్పులు.. వీడియో చూశారా?
Ananya Pandey,andre Russell
Basha Shek
|

Updated on: May 28, 2024 | 2:46 PM

Share

ఆదివారం (మే 26) జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసింది. తద్వారా ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచింది. సుమారు 10 ఏళ్ల తర్వాత కేకేఆర్ జట్టు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. దీంతో ఆ జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. కోల్‌క‌తా ఫ్రాంచైజీ య‌జ‌మాని షారుఖ్ ఖాన్ ఈ విన్నింగ్ సెల‌బ్రేష‌న్స్‌ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లారు. కేకేఆర్ ప్లేయర్లు, సిబ్బంది, ఇతర ప్రముఖుల కోసం ప్ర‌త్యేకంగా డిన్న‌ర్ ఏర్పాటు చేశారు.  బాలీవుడ్ ప్ర‌ముఖులు కూడా ఈ స్పెష‌ల్ డిన్న‌ర్‌లో సందడి చేయడం విశేషం. షారూఖ్ ఖాన్, అనన్య పాండే, జూహీ చావ్ తదితరులు ఈ పార్టీలో తళుక్కుమన్నారు. ఇందులో భాగంగా లైగర్ బ్యూటీ అనన్యా పాండే విండీస్ స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ తో కలిసి సరదాగా స్టెప్పులేసింది. షారుఖ్ న‌టించిన ‘డుంకీ’ మూవీలోని ‘లుట్ పుట్ గ‌యా’ పాట‌కు వీరిద్దరూ హుషారుగా డ్యాన్స్ చేశారు. మరో కేకేఆర్ ప్లేయర్ రమణదీప్ సింగ్, కేకేఆర్ హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్ ఈ పాటకు సరదాగా కాలు కదిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది.

కోల్‌కతా మూడోసారి చాంపియన్‌గా నిలవడంలో రస్సెల్ కీలక పాత్ర పోషించాడు. అతను 15 మ్యాచ్‌ల్లో 222 పరుగులు చేశాడు. అలాగే ఈ సీజన్‌లో 19 వికెట్లు పడగొట్టాడు. ఇక అనన్య పాండే గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. KKR యజమాని షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్‌కి అనన్య పాండే బెస్ట్ ఫ్రెండ్. అందుకే తరచూ ఆమె ఐపీఎల్ కేకేఆర్ జట్టుకు మద్దతుగా స్టేడియంలో సందడి చేస్తుంటుంది.

ఇవి కూడా చదవండి

రస్సెల్, అనన్యా పాండే ల డ్యాన్స్.. వీడియో ఇదిగో..

ధనాధాన్ బ్యాటింగ్, ఫాస్ట్ బౌలింగ్ తో ప్రత్యర్థుల పని పట్టే ఆండ్రీ రస్సెల్ మంచి డ్యాన్సర్ అండ్ సింగర్ కూడా. తాజాగా బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చాడీ కరేబియన్ ఆల్ రౌండర్. చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్ అవికాగోర్‌తో క‌లిసి ఓ ఆల్భ‌మ్ చేశాడు. ‘లడ్కీ తు కమాల్ కీ’ అంటూ సాగే హిందీ ఆల్బమ్‌లో అవికా గోర్‌తో క‌లిసి ర‌స్సెల్ హుషారైన స్టెప్పులు వేసి అల‌రించాడు. అంతేకాదండోమ్ పాట‌ని కూడా ర‌స్సెల్ పాడ‌డం విశేషం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.