AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramayan Movie: రణబీర్ కపూర్, సాయి పల్లవి రామాయణంపై ఆసక్తికర అప్డేట్.. యష్ అభిమానులకు ఇది బ్యాడ్ న్యూసే..

ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ అయ్యారు బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ. కానీ ఈసారి రాముడి కథను కొత్తగా.. అత్యంత ప్రతిష్టాత్మకంగా వెండితెరపై ఆవిష్కరించనున్నారు. ఇందులో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో.. న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతగా కనిపించనున్నారు. ఇక లక్ష్మణుడి పాత్రలో రవి దూబే నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. సన్నీ డియోల్‌ను హనుమంతుడిగా కనిపించనున్నారని తెలుస్తోంది.

Ramayan Movie: రణబీర్ కపూర్, సాయి పల్లవి రామాయణంపై ఆసక్తికర అప్డేట్.. యష్ అభిమానులకు ఇది బ్యాడ్ న్యూసే..
Ramayan
Rajitha Chanti
|

Updated on: Apr 03, 2024 | 9:36 PM

Share

రామాయణం.. అందరికి తెలిసిన ఇతిహాస గాథే. ఇప్పటికే ఎన్నో సినిమాలు, సీరియల్స్ చిత్రీకరించారు. కానీ ఎప్పుడూ విన్నా.. చదివినా రామాయణం కథ కొత్తగానే అనిపిస్తుంది. తెలుగు, హిందీ, తమిళం భాషలలో ఇప్పటికే ఎన్నోసార్లు ఈ ఇతిహాస గాథను రూపొందించారు. కానీ ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ అయ్యారు బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ. కానీ ఈసారి రాముడి కథను కొత్తగా.. అత్యంత ప్రతిష్టాత్మకంగా వెండితెరపై ఆవిష్కరించనున్నారు. ఇందులో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో.. న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతగా కనిపించనున్నారు. ఇక లక్ష్మణుడి పాత్రలో రవి దూబే నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. సన్నీ డియోల్‌ను హనుమంతుడిగా కనిపించనున్నారని తెలుస్తోంది.

అలాగే రావణుడి పాత్రలో కన్నడ హీరో యష్ కనిపించనున్నారని తెలుస్తోంది. ఇందుకోసం దాదాపు రూ. 150 కోట్లు పారితోషికం ఇస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. రామాయణాన్ని దాదాపు మూడు భాగాలుగా రూపొందిస్తున్నారట. ఈ మూవీ గురించి ప్రతిరోజూ కొత్త అప్డేట్స్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తుంటాయి. ఆ మధ్య బడ్జెట్‌కు తగ్గట్టుగా సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. అప్పుడు దాని షూటింగ్ షెడ్యూల్ పొడిగించారని టాక్ నడిచింది. అయితే ఇన్ని ఊహాగానాల మధ్య ఈ సినిమా షూటింగ్ మొదలైంది. కానీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరలవుతుంది.

ఏప్రిల్ 2న రామాయణం సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అలాగే ఇప్పుడు కేవలం బాలనటులు మాత్రమే చిత్రీకరణలో పాల్గొంటున్నారని తెలుస్తోంది. యష్, రణబీర్, సాయి పల్లవి ఇంకా షూటింగ్ సెట్‌కి వెళ్లలేదని సమాచారం. ఈ సినిమా మొదటిభాగంలో యష్ కనిపించరట. అతడు రెండవ భాగం షూటింగ్ లో జాయిన్ అవుతాడని అంటున్నారు. అయితే మొదటి భాగంలో కూడా రావణుడి పాత్రను పరిచయం చేయాలనుకున్నారట నితీష్ తివారీ. కానీ యష్ కమిట్‌మెంట్స్ కారణంగా ఈ మూవీ ఫస్ట్ పార్ట్ లో అతడు కనిపించడని అంటున్నారు. ప్రస్తుతం యష్ టాక్సిక్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాతే రామాయణం షూటింగ్ సెట్స్‌లో అడుగుపెట్టనున్నారని అంటున్నారు. అయితే ప్రస్తుతం యశ్ గురించి వినిపిస్తున్న వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
ఇక టోల్ గేట్ల దగ్గర ఆగే పన్లేదు.. రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లిపోవచ్చు
ఇక టోల్ గేట్ల దగ్గర ఆగే పన్లేదు.. రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లిపోవచ్చు