Salaar సలార్ ఇంగ్లీష్ వెర్షన్ పై లేటేస్ట్ అప్టేట్.. స్పెషల్ కేర్ తీసుకుంటోన్న నీల్ !..
ముఖ్యంగా ఇందులో ప్రభాస్ ను డైనోసార్ తో పోలుస్తూ సినిమాపై మరింత హైప్ పెంచేసారు మేకర్స్. చాలా కాలం తర్వాత డార్లింగ్ ఫుల్ మాస్ యాక్షన్ హీరోగా అడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఇందులో డార్లింగ్ జోడిగా శ్రుతి హాసన్ నటిస్తుండగా.. మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా.. విలక్షణ నటుడు జగపతి బాబు కీలకపాత్ర పోషిస్తున్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న సినిమా సలార్. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తోన్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఇందులో ప్రభాస్ ను డైనోసార్ తో పోలుస్తూ సినిమాపై మరింత హైప్ పెంచేసారు మేకర్స్. చాలా కాలం తర్వాత డార్లింగ్ ఫుల్ మాస్ యాక్షన్ హీరోగా అడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఇందులో డార్లింగ్ జోడిగా శ్రుతి హాసన్ నటిస్తుండగా.. మలయాళీ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా.. విలక్షణ నటుడు జగపతి బాబు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియాతోపాటు.. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే అనౌన్స్ చేశారు. తాజాగా సలార్ రిలీజ్ డేట్ పై ఇంట్రెస్టింగ్ బజ్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.
తెలుగుతోపాటు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. అయితే వరల్డ్ వైడ్ ప్రభాస్ క్రేజ్ తో ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం సలార్ మూవీ ఇంగ్లీష్ వెర్షన్ అన్ని భాషలతో కలిపి ఒకేసారి రిలీజ్ చేసే అవకాశం ఉండకపోవచ్చని టాక్. ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ కాస్త లేట్ అయ్యే ఛాన్స్ ఉందట. సలార్ రిలీజ్ తర్వాత అక్టోబర్ లో ఈ మూవీ ఇంగ్లీష్ వెర్షన్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇక ఈ సినిమా ట్రైలర్ ఆగస్ట్ నెలలో విడుదల చేయనున్నారని తెలుస్తోంది. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని రెండు పార్ట్స్ గా తీసుకురాబోతున్నారు ప్రశాంత్ నీల్. మదర్ సెంటిమెంట్ తోపాటు, ఫ్రెండ్ షిప్ టచ్ కూడా ఉంటుందట. గ్యాంగ్ స్టర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాపై నీల్ స్పెషల్ ఫోకస్ పెట్టారని.. సౌండ్ మేకింగ్, డబ్బింగ్ విషయాల్లో చాలా కేర్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రాబోతుంది.
