AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Due Date: బర్నింగ్‌ ఇష్యూపై కమర్షియల్‌ కోర్ట్‌రూమ్‌ డ్రామా! ‘డ్యూ డేట్‌’ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్

ఇటీవల కోర్ట్ రూమ్ డ్రామా సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సినిమా కూడా సేమ్ టు సేమ్ అలాంటిదే. ప్రజెంట్‌ బర్నింగ్‌ ఇష్యూ ఆధారంగా అల్లుకున్న ఈ కమర్షియల్‌ కోర్ట్‌ రూమ్‌ డ్రామా ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా ఉంటుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.

Due Date: బర్నింగ్‌ ఇష్యూపై కమర్షియల్‌ కోర్ట్‌రూమ్‌ డ్రామా! 'డ్యూ డేట్‌' సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
Due Date Movie
Basha Shek
|

Updated on: Oct 07, 2026 | 6:15 AM

Share

లోమేష్‌ పుడిపెద్ది హీరోగా, జయశ్రీ‌ హీరోయిన్‌గా, ప్రణీత పట్నాయక్, విజ్ఞానిలు ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘డ్యూ డేట్‌’. వరిష్‌ స్టూడియోస్‌ పతాకంపై పవన్‌ తరిగోపుల, ఏలూరు శ్రీను నిర్మాతలుగా ఆనంద్‌.కె. దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవల ఘనంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ రోజు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో, హీరోయిన్‌ ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ప్రజెంట్‌ బర్నింగ్‌ ఇష్యూ ఆధారంగా అల్లుకున్న ఈ కమర్షియల్‌ కోర్ట్‌ రూమ్‌ డ్రామా ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా ఉంటుంది. ప్రతి మనిషి, ప్రతి నెలా గుర్తుపెట్టుకునే డ్యూ డేట్‌ చుట్టు పూర్తి వాణిజ్య అంశాలతో అల్లుకున్న కథ ఇది. టైటిల్‌ దగ్గర నుంచి సినిమాలోని ప్రతి అంశం ప్రేక్షకులకు కొత్తదనంతో పాటు పూర్తి సంతృప్తిని కలిగించే కథ, కథనాలు ఈ చిత్రంలో ఉంటాయి. ఈ రోజు నుంచి 15 రోజుల పాటు ఏకధాటిగా జరిగే షెడ్యూల్‌తో తొలి షెడ్యూల్‌ పూర్తవుతుంది. తప్పకుండా ఈ చిత్రం అందర్ని ఆలోచింపజేస్తుంది. హృదయాలకు హత్తుకుంటుంది’ అన్నారు.

లోమేష్‌ పుడిపెద్ది, జయశ్రీ‌, ప్రణీత పట్నాయక్, విజ్క్షాని, కృష్ణ భగవాన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్‌: జవ్వాడి నాయుడు, మాటలు అందిస్తున్నారు. హరీష్‌ మీనన్‌, ఎడిటర్‌ గా వ్యవహరిస్తున్నారు. అలాగే సత్య గిడుటూరి, డీఓపీ గా పని చేస్తున్నారు. పవన్‌ తరిగోపుల, ఏలూరు శ్రీను సంయుక్తంగా నిర్మిస్తున్న డ్యూ డేట్ సినిమాకు ఆనంద్ కే. దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి త్వరలోనే మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Follow Us
బర్నింగ్‌ ఇష్యూపై కమర్షియల్‌ కోర్ట్‌రూమ్‌ డ్రామా 'డ్యూ డేట్‌'
బర్నింగ్‌ ఇష్యూపై కమర్షియల్‌ కోర్ట్‌రూమ్‌ డ్రామా 'డ్యూ డేట్‌'
బెంగళూరు నుంచి దుబాయ్ వరకు..ఓ అమ్మాయి జీవితాన్ని మార్చిన 3 నగరాలు
బెంగళూరు నుంచి దుబాయ్ వరకు..ఓ అమ్మాయి జీవితాన్ని మార్చిన 3 నగరాలు
దిన ఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్
దిన ఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!