AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అర్ధరాత్రి వింత శబ్దాలు.. పొదల చాటున వెళ్లి చూడగా గుండె ఆగినంత పనైంది..

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అర్ధరాత్రి భారీ కొండచిలువ కలకలం రేపింది. కృషి బైపాస్ రోడ్డులోని ఓ ఇంటి ఆవరణలోకి సుమారు 12 అడుగుల పొడవున్న కొండచిలువ రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న రిటైర్డ్ ఎఫ్‌బీఓ మహమ్మద్ దానిని సురక్షితంగా పట్టుకుని నీలాద్రి అర్బన్ పార్క్ అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

అర్ధరాత్రి వింత శబ్దాలు.. పొదల చాటున వెళ్లి చూడగా గుండె ఆగినంత పనైంది..
Python Rescue
N Narayana Rao
| Edited By: |

Updated on: Nov 09, 2026 | 8:16 AM

Share

ఖమ్మం / సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో అర్ధరాత్రి వేళ భారీ కొండచిలువ కలకలం రేపింది. కృషి బైపాస్ రోడ్డులోని ఒక ఇంటి ఆవరణలోకి 12 అడుగుల పొడవున్న కొండచిలువ రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అర్ధరాత్రి చిమ్మ చీకటిలో ఇంటి ఆవరణలోని పొదల్లోంచి వింతైన, భారీ శబ్దాలు రావడంతో ఇంట్లోని వారు, స్థానికులు ఉలిక్కిపడ్డారు. అనుమానంతో పొదల చాటుకు వెళ్లి చూడగా.. మెల్లగా పాకుతూ వెళ్తున్న భారీ కొండచిలువ కనిపించింది.

మురసు తుఫాను కారణంగా..

ఇటీవల ‘మురసు’ తుఫాను కారణంగా సత్తుపల్లి ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతోపాటు వరదలు వచ్చాయి. ఈ వరద ప్రవాహానికి సమీప అటవీ ప్రాంతం నుంచి కొండచిలువ కొట్టుకు వచ్చి జనావాసాల్లోకి చొరబడినట్లు భావిస్తున్నారు.

వీడియో చూడండి..

కొండచిలువను చూసి భయపడిన కాలనీవాసులు తక్షణమే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. రెస్క్యూ సమాచారం అందుకున్న రిటైర్డ్ ఎఫ్‌బీఓ (FBO) మహమ్మద్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయన చాకచక్యంగా వ్యవహరించి, ప్రాణాపాయం కలగకుండా ఆ 12 అడుగుల కొండచిలువను సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం దానిని నీలాద్రి అర్బన్ పార్క్ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి విడిచిపెట్టారు.

పెరుగుతున్న పాముల సంచారం

గత మూడు నెలలుగా ఈ సమీప ప్రాంతాల్లో కొండచిలువల సంచారం ఎక్కువైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మున్సిపల్ చైర్మన్, సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో కాలనీ పరిసరాల్లో ఉన్న పిచ్చి చెట్లను, పొదలను తొలగించి శుభ్రం చేశారు. పరిసరాలు శుభ్రం చేసినప్పటికీ, మళ్లీ మళ్లీ జనావాసాల్లోకి భారీ కొండచిలువలు వస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి నిరంతరం పర్యవేక్షణ పెంచాలని, పాముల సంచారాన్ని అరికట్టేలా శాశ్వత చర్యలు చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు.

Follow Us
సత్తుపల్లిలో అర్ధరాత్రి కలకలం: 12 అడుగుల భారీ కొండచిలువ రెస్క్యూ.
సత్తుపల్లిలో అర్ధరాత్రి కలకలం: 12 అడుగుల భారీ కొండచిలువ రెస్క్యూ.
రుణం చెల్లించకపోతే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేయవచ్చా?
రుణం చెల్లించకపోతే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేయవచ్చా?
సైనిక్ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు 2027.. లింక్ ఇదే
సైనిక్ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు 2027.. లింక్ ఇదే
IND vs NZ: సిరీస్‌పై కన్నేస్తే, భారీ ప్రమాదమే ముంచుకొస్తోందిగా..!
IND vs NZ: సిరీస్‌పై కన్నేస్తే, భారీ ప్రమాదమే ముంచుకొస్తోందిగా..!
బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!
బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!
హెల్మెట్‌తో సాధారణ బాటసారిలా సంజూ శాంసన్.. కట్‌చేస్తే..
హెల్మెట్‌తో సాధారణ బాటసారిలా సంజూ శాంసన్.. కట్‌చేస్తే..
హైదరాబాద్‌లో దీపావళి వేడుకల్లో అపశృతి.. 67 మందికి గాయాలు!
హైదరాబాద్‌లో దీపావళి వేడుకల్లో అపశృతి.. 67 మందికి గాయాలు!
ఇక బట్టీ పట్టి రాస్తే సరిపోదు.. ఇంటర్ ప్రశ్నపత్రాల్లో కీలక మార్పు
ఇక బట్టీ పట్టి రాస్తే సరిపోదు.. ఇంటర్ ప్రశ్నపత్రాల్లో కీలక మార్పు
నేటి రాశి ఫలాలు: ఈ 5 రాశుల వారికి శుభవార్తలు, ధనలాభం!
నేటి రాశి ఫలాలు: ఈ 5 రాశుల వారికి శుభవార్తలు, ధనలాభం!
పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..
పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..