AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sundeep Kishan: సందీప్ కిషన్ హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. నాసిరకం వస్తువులు గుర్తింపు..

ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ రెస్టారెంట్‏లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సికింద్రాబాద్లోని వివాహ భోజనం హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయగా.. కాలం చెప్పిన బియ్యంతోపాటు నాసిరకం వస్తువులతో ఆహార పదార్థాలు తయారీ చేస్తున్నట్లు గుర్తించారు.

Sundeep Kishan: సందీప్ కిషన్ హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. నాసిరకం వస్తువులు గుర్తింపు..
Sundeep Kishan
Rajitha Chanti
|

Updated on: Jul 10, 2024 | 3:19 PM

Share

కొద్దిరోజులుగా హైదరాబాద్, సికింద్రాబాద్‏లోని పలు రెస్టారెంట్లలో జీహెచ్ఎంసీ సిబ్బందితోపాటు రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్‏ఫోర్స్ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో హోటల్స్ పరిశీలించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. పరిశుభ్రత, నాణ్యత లేని ఫుడ్ రెడీ చేస్తున్న హోటల్స్ కు జరిమానా విధించి నోటీసులు కూడా జారీ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ రెస్టారెంట్‏లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సికింద్రాబాద్లోని వివాహ భోజనం హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయగా.. కాలం చెప్పిన బియ్యంతోపాటు నాసిరకం వస్తువులతో ఆహార పదార్థాలు తయారీ చేస్తున్నట్లు గుర్తించారు.

అలాగే వండిన ఆహార పదార్థాలు నిలువ చేసి ఫ్రిజ్లో పెడుతున్న తీరును గుర్తించారు. ఫ్రిజ్లో నిల్వచేసిన వస్తువులను వేడి చేసి కస్టమర్లకు అందిస్తున్నారని.. ఫుడ్ ప్రిపరేషన్ కోసం వాడుతున్న నీటి కరిష్టాన్ని కూడా గుర్తించారు. కిచెన్లో పరిశుభ్రత లోపించిందని.. సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపిన కొబ్బెరను గుర్తించారు. ముందుగా తయారు చేసిన ఉంచిన ఫుడ్ ఎక్స్పైరీ తేదీ లేకుండానే ఉంచారు. ఫుడ్ తయారు చేస్తున్న వారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ కూడా లేవని.. వంటపాత్రలను క్లీన్ చేసిన నీరు కూడా అక్కడే నిల్వ ఉండడం వంటి లోపాలను అధికారులు గుర్తించారు.

కిచెన్ లో ఓ కాలువ మాదిరిగా ఉన్న ఫ్లోర్ నుంచి నీరు బయటకు పంపుతున్నారు. గడువు ముగిసిన 25 కేజీల చిట్టి ముత్యాలు బియ్యాన్ని పట్టుకున్నారు. నాణ్యత లేని ఈ బియ్యంతో ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు వివాహ భోజనంబు రెస్టారెంట్ వివరాలను.. అక్కడ ఉపయోగిస్తున్న ఫుడ్ వివరాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఓవైపు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్న సందీప్.. చాలా కాలం క్రితమే ఫుడ్, రెస్టారెంట్ బిజినెస్ లోకి దిగారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us