Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Independence day: దేశ భక్తిని ఉప్పొంగించే టాలీవుడ్ సాంగ్స్.. నరనరానా ఇంకిన పాటలు ఇవి

దేశ భక్తి గీతాలు అనగానే మనకు ముందుగా గుర్తుకువచ్చే పాట పుణ్యభూమి నాదేశం. నందమూరి తారకరామారావు నటించిన మేజర్ చంద్రకాంత్ సినిమాలో పుణ్యభూమి నాదేశం నమోనామమి అనే సాంగ్ ప్రతి తెలుగువాడి నరనరానా.. ఇంకిపోయింది. ఆ సాంగ్ వింటేనే దేశ భక్తి ఉప్పొంగుతుంది. ఈ పాటలో ఎంతో గొప్ప భావం ఉంటుంది.

Independence day: దేశ భక్తిని ఉప్పొంగించే టాలీవుడ్ సాంగ్స్.. నరనరానా ఇంకిన  పాటలు ఇవి
Tollywood
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 15, 2024 | 11:29 AM

దేశ వ్యాప్తంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగులో ఎన్నో దేశభక్తి సినిమాలు విడుదలయ్యాయి. ఈ స్వాతంత్ర్య దినోత్సవాన్ని చూడాల్సిన తెలుగు సినిమాలు చాలానే ఉన్నాయి. దేశ భక్తి గీతాలు అనగానే మనకు ముందుగా గుర్తుకువచ్చే పాట పుణ్యభూమి నాదేశం. నందమూరి తారకరామారావు నటించిన మేజర్ చంద్రకాంత్ సినిమాలో ‘పుణ్యభూమి నాదేశం నమోనామమి’ అనే సాంగ్ ప్రతి తెలుగువాడి నరనరానా.. ఇంకిపోయింది. ఆ సాంగ్ వింటేనే దేశ భక్తి ఉప్పొంగుతుంది. ఈ పాటలో ఎంతో గొప్ప భావం ఉంటుంది. స్వాతంత్ర సమరయోధుల గురించి ఈ పాటలో అద్భుతంగా వివరించారు.

అలాగే కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం సినిమాలోనూ దేశభక్తి సాంగ్స్ ఉన్నాయి. శ్రీకాంత్, రవితేజ , ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను అద్భుతమైన కథతో తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణవంశీ. ఈ సినిమాలో ‘మేమే ఇండియన్స్’ పాట శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే ఖడ్గం టైటిల్ సాంగ్ కూడా దేశభక్తిని పెంచేస్తుంది. అలాగే మరో దేశభక్తి సినిమా సూపర్ స్టార్ కృష్ణ నటించిన అల్లూరు సీతారామరాజు. బ్రిటీష్ పాలకుల పై విరుచుకుపడిన మన్యంవీరుడు అల్లూరి కథతో కృష్ణ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో అన్ని సాంగ్స్ సూపర్ హిట్ గా నిలిచాయి. ‘తెలుగు వీర లేవరా- దీక్ష బూని’ సాగరా వినని తెలుగు ప్రేక్షకుడు ఉండడు.

వీటితోపాటు.. నవదీప్ హీరోగా నటించిన జై సినిమాలో దేశం ‘మనదే.. తేజం మనదే’ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఈ సాంగ్ విటుంటేనే దేశభక్తి ఉప్పొంగుతుంది. అలాగే మంచు మనోజ్ హీరోగా నటించిన ఝుమ్మంది నాదం సినిమాలో ‘దేశమంటే మట్టి కాదోయ్’  అనే సాంగ్ కూడా శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో ‘ఓ బాపు నువ్వే రావాలి’ సాంగ్ కూడా దేశభక్తిని రెట్టింపు చేస్తుంది. మహేష్ బాబు నటించిన బాబీ సినిమాలో కూడా దేశభక్తి సాంగ్ కూడా ఉంది. వీటితో పాటు మహాత్మ సినిమాలోని ‘ఇందిరమ్మ ఇంటి పేరు కాదురా గాంధీ’ అనే సాంగ్ జాతిపిత గాంధీ పై భక్తిని పెంచేస్తుంది. అలాగే మెగాస్టార్ నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలనూ దేశభక్తి సాంగ్ ఉంది. రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నెత్తురు మరిగితే ఎత్తర జెండా’ సాంగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో దేశభక్తి సాంగ్స్ మన టాలీవుడ్ లో ఉన్నాయి.

మహాత్మ మూవీ సాంగ్..

నవదీప్ హీరోగా నటించిన జై సినిమా సాంగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..