Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mr. Bachchan Review: మిస్టర్ బచ్చన్ రివ్యూ .. మాస్ రాజా మూవీ ఎలా ఉందంటే..

మిరపకాయ్ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా కావడంతో మిస్టర్ బచ్చన్‌పై అంచనాలు మామూలుగా లేవు. తాజాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మిస్టర్ బచ్చన్ ఎలా ఉన్నాడు..? ఆడియన్స్‌ను మెప్పించాడా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం.. 

Mr. Bachchan Review: మిస్టర్ బచ్చన్ రివ్యూ .. మాస్ రాజా మూవీ ఎలా ఉందంటే..
Mr.bachchan Movie
Follow us
Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Rajeev Rayala

Updated on: Aug 15, 2024 | 11:49 AM

మూవీ రివ్యూ: మిస్టర్ బచ్చన్

నటీనటులు: రవితేజ, భాగ్య శ్రీ బోర్సే, జగపతిబాబు, సత్య, సచిన్ ఖేడ్‌కర్, ప్రవీణ్, శుభలేక సుధాకర్ తదితరులు

ఎడిటర్: ఉజ్వల్ కులకర్ణి

సినిమాటోగ్రఫీ: అయాంక బోస్

సంగీతం: మిక్కీ జే మేయర్

నిర్మాత: టిజి విశ్వప్రసాద్

స్క్రీన్ ప్లే, దర్శకుడు: హరీష్ శంకర్ ఎస్

మిరపకాయ్ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా కావడంతో మిస్టర్ బచ్చన్‌పై అంచనాలు మామూలుగా లేవు. తాజాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మిస్టర్ బచ్చన్ ఎలా ఉన్నాడు..? ఆడియన్స్‌ను మెప్పించాడా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

బచ్చన్ (రవితేజ) ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్లో సిన్సియర్ ఆఫీసర్. ఒకసారి ఒక పెద్ద వ్యక్తి మీద ఐటి రైడ్ చేసి సస్పెండ్ అవుతాడు. ఆ తర్వాత ఊరికి వచ్చి ఆర్కెస్ట్రా పెట్టుకొని ఉంటాడు. అదే సమయంలో జిక్కి (భాగ్యశ్రీ బోర్సే)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. పెళ్లి కూడా చేసుకునే సమయానికి మళ్లీ ఇన్కమ్ టాక్స్ ఆఫీసు నుంచి సస్పెన్షన్ ఎత్తివేసినట్టు ఆర్డర్ వస్తుంది. ముత్యం జగ్గయ్య (జగపతిబాబు) మీద ఐటి రైట్స్ చేయాలని చెప్తారు. లాంగెస్ట్ ఐటి రైడ్ చేసిన తర్వాత కొన్ని వందల కోట్లు వాళ్ళ ఇంట్లో పట్టుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది.. మిస్టర్ బచ్చన్ జీవితంలో ఎలాంటి మార్పులు జరిగాయి అనేది అసలు కథ..

కథనం:

కొన్ని సినిమాలకు కాంబినేషన్ తోనే పని.. కథతో కాదు.. మిస్టర్ బచ్చన్ కూడా అలాంటి సినిమానే. మాకు కొత్తదనం వద్దు.. పరమ రొటీన్ అయినా పర్లేదు అనుకుంటే ఈ బచ్చన్ మెప్పిస్తాడు. ఫ్యాన్స్ కోసం ఫస్ట్ హాఫ్ అంతా వింటేజ్ రవితేజను చూపించాడు హరీష్ శంకర్. కథకు అస్సలు సంబంధం లేని హీరో, హీరోయిన్ ట్రాక్ ఇది. నో లాజిక్ అనుకుంటే బాగా ఎంజాయ్ చేస్తారు. అదేంటి ఆ సీన్ అని బుర్రకు పని చెప్తే ఆఫ్ అయిపోతారు.. జస్ట్ గో విత్ ఫ్లో అనుకోవాలి.. అప్పుడే బచ్చన్ నచ్చుతాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో హిందీ పాటలు ఎక్కువయ్యాయి. ఆ ప్లేస్ లో తెలుగు పాటలు పెట్టుంటే థియేటర్ ఊగిపోయేది.. చాలా మంది ఆడియన్స్ ఫీల్ ఇదే అయ్యుంటుంది. అక్కడే కనెక్టివిటీ మిస్ అయినట్లు అనిపిస్తుంది. అసలు కథ సెకండ్ హాఫ్ లోనే ఉంది. స్టోరీ అంతా ఒకేచోట జరుగుతుంది కాబట్టి బోర్ కొట్టకుండా చాలా జిమ్మిక్కులు చేశాడు హరీష్.. అందులో కొన్ని ఫ్యాన్స్ కి కిక్ ఇస్తాయి కూడా. రవితేజ, జగపతి బాబు మధ్య సీన్స్ బాగున్నాయి.. ఓ యంగ్ హీరో కేమియో కూడా ఉంది ఈ సినిమాలో.. అది అదిరిపోయింది. నిజానికి రెయిడ్ కథలో కమర్షియల్ కోణం లేదు.. డ్రై సబ్జెక్ట్ అది.. పాయింట్ నచ్చి తీసుకున్నాడు హరీష్ శంకర్. కమర్షియలైజ్ చేయడానికి తనవంతు ప్రయత్నం చేశాడు దర్శకుడు. అందులో కొంతవరకు సక్సెస్ అయ్యాడు హరీష్ శంకర్.

నటీనటులు:

రవితేజకి ఈ క్యారెక్టర్ కొట్టిన పిండి. తనకు అలవాటైన పాత్రలో ఇరక్కొట్టాడు. చాలావరకు వింటేజ్ రవితేజ ను చూపించే ప్రయత్నం చేశాడు హరీష్. భాగ్యశ్రీ బోర్సే మిస్టర్ బచ్చన్ కు ప్లస్.. ఆమె గ్లామర్ నెక్స్ట్ లెవెల్. సత్య, చమ్మక్ చంద్ర కామెడీ ఓకే. మిగిలిన వాళ్ళందరూ ఓకే..

టెక్నికల్ టీం:

మిస్టర్ బచ్చన్ సినిమాకు ప్రధానమైన పాజిటివ్ పాయింట్ మిక్కిజే మేయర్ సంగీతం. ఆయన అందించిన పాటలు బాగున్నాయి.. చూడ్డానికి.. వినడానికి కూడా. ఎడిటింగ్ ఈజీగా సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు తీసేయొచ్చు. కానీ దర్శకుడు ఛాయిస్ కాబట్టి అతని పనితీరును తప్పు పట్టలేము. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. దర్శకుడు హరీష్ శంకర్ కొన్ని చోట్ల మాత్రమే సక్సెస్ అయ్యాడు. అతని మార్క్ చాలా చోట్ల మిస్ అయినట్టు అనిపించింది.

పంచ్ లైన్:

ఓవరాల్ గా మిస్టర్ బచ్చన్.. బాగా రొటీన్.. కానీ మరీ బోరింగ్ కాదు..