AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rules: మీరు విదేశాల నుంచి బంగారం తీసుకొస్తున్నారా? అయితే కొత్త నిబంధనలు ఇవే!

Gold Rules: విదేశాల నుంచి భారతదేశానికి బంగారం తీసుకువచ్చే వ్యక్తులు కస్టమ్స్ సుంకం చెల్లించాల్సి ఉంటుంది. విదేశాల నుంచి భారతదేశానికి వచ్చే వ్యక్తులు ఒక నిర్దిష్ట మొత్తానికి మించి బంగారం తీసుకువస్తే ఈ కస్టమ్స్ సుంకం చెల్లించాల్సి ఉంటుంది. గతంలో రూ..

Gold Rules: మీరు విదేశాల నుంచి బంగారం తీసుకొస్తున్నారా? అయితే కొత్త నిబంధనలు ఇవే!
New Gold Rules
Subhash Goud
|

Updated on: Feb 05, 2026 | 6:00 AM

Share

Gold Rules: ప్రపంచంలో అత్యధికంగా వినియోగించబడే లోహం బంగారం. బంగారం డిమాండ్, వినియోగం పెరిగేకొద్దీ దాని ధర కూడా బాగా పెరుగుతోంది. బంగారం గరిష్ట స్థాయిలో ఉన్నప్పటికీ భారతదేశంతో పోలిస్తే కొన్ని దేశాలలో బంగారం కొంచెం తక్కువ ధరకు అమ్ముడవుతోంది. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు ప్రయాణించే చాలా మందికి విదేశాల నుండి బంగారం కొనుగోలు చేసే అలవాటును ఉంటుంది. విదేశాల నుండి బంగారం కొనడానికి కొన్ని పరిమితులు, నియమాలు ఉన్నప్పటికీ దానిలో కొన్ని మార్పులు ఉన్నాయి.

విదేశాల నుంచి బంగారం తీసుకురావడానికి నిబంధనలలో మార్పులు:

విదేశాల నుంచి భారతదేశానికి బంగారం తీసుకువచ్చే వ్యక్తులు కస్టమ్స్ సుంకం చెల్లించాల్సి ఉంటుంది. విదేశాల నుంచి భారతదేశానికి వచ్చే వ్యక్తులు ఒక నిర్దిష్ట మొత్తానికి మించి బంగారం తీసుకువస్తే ఈ కస్టమ్స్ సుంకం చెల్లించాల్సి ఉంటుంది. గతంలో రూ. 50 వేల వరకు విలువైన బంగారాన్ని ఎటువంటి కస్టమ్స్ సుంకం చెల్లించకుండానే భారతదేశంలోకి తీసుకురావడానికి అనుమతి ఉండేది. ఈ పరిస్థితిలో దీనిలో మార్పు చేశారు. అంటే ఇప్పుడు రూ. 75 వేల వరకు విలువైన బంగారాన్ని విదేశాల నుంచి భారతదేశానికి తీసుకురావడానికి అనుమతి ఉంది. ఈ కొత్త నియమాలు ఫిబ్రవరి 02, 2026 నుండి అమలులోకి వచ్చాయి.

Gold, Silver, Copper: 2026లో బంగారం, వెండి, రాగి ధరలు భారీగా పెరుగుతాయా? బాబా వంగా అంచనా ఏంటి?

కొత్త నియమాలు ఏం చెబుతున్నాయి?

కొత్త నిబంధనల ప్రకారం.. భారతదేశ నివాసితులు లేదా పర్యాటక వీసాలు కాకుండా ఇతర వీసాలపై భారతదేశానికి వచ్చే విదేశీయులు కస్టమ్స్ సుంకం లేకుండా రూ. 75,000 వరకు విలువైన బంగారాన్ని తీసుకురావడానికి అనుమతి ఉంది. విదేశీ పర్యాటకులు కస్టమ్స్ సుంకం లేకుండా దాదాపు రూ.25 విలువైన బంగారాన్ని తీసుకురావచ్చు.

ఇవి కూడా చదవండి

భారత పౌరులైన మహిళలు, ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం విదేశాలలో నివసిస్తున్న మహిళలు 40 గ్రాముల వరకు బంగారాన్ని సుంకం లేకుండా భారతదేశానికి తీసుకురావచ్చని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) తెలిపింది. పురుషులు 20 గ్రాముల వరకు బంగారాన్ని తీసుకురావచ్చు. వారికి కస్టమ్స్ సుంకం నుండి మినహాయింపు ఉంటుంది.

ఇది కూడా చదవండి: Gold Loan: బ్యాంకులో 10 గ్రాముల బంగారంపై ఎంత రుణం ఇస్తారు? EMI ఎంత?

Follow Us
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో