Pushpa 2: The Rule: ఇది కదా సార్.. పుష్ప రేంజ్..! ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసిన టీజర్..

ఎక్కడ చూసిన పుష్ప డైలాగ్సే వినిపిస్తున్నాయి. అంతే కాదు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు అందించిన సంగీతం కూడా సూపర్ హిట్ గా నిలిచింది. సినిమా విజయానికి దేవి మ్యూజిక్ కూడా కారణం అనే చెప్పాలి. ఈ సినిమాలోని పాటలు.. ముఖ్యంగా శ్రీ వల్లి సాంగ్ విపరీతమైన పాపులారిటీ తెచ్చుకుంది. ఎర్రచందం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్న నటించింది.

Pushpa 2: The Rule: ఇది కదా సార్.. పుష్ప రేంజ్..! ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసిన టీజర్..
Pushpa 2
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 09, 2024 | 11:38 AM

పుష్ప.. పుష్పరాజ్ నీయ్యవ్వా తగ్గేదే లే.. అంటూ బాక్సాఫీస్ ను కుమ్మేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ పాన్ ఇండియా మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పేరు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగింది. ఎక్కడ చూసిన పుష్ప డైలాగ్సే వినిపిస్తున్నాయి. అంతే కాదు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు అందించిన సంగీతం కూడా సూపర్ హిట్ గా నిలిచింది. సినిమా విజయానికి దేవి మ్యూజిక్ కూడా కారణం అనే చెప్పాలి. ఈ సినిమాలోని పాటలు.. ముఖ్యంగా శ్రీ వల్లి సాంగ్ విపరీతమైన పాపులారిటీ తెచ్చుకుంది. ఎర్రచందం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్న నటించింది.

ఇక ఈ సినిమా పార్ట్ 2 కోసం అభిమానులు, ప్రేక్షకులు ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. కాగా రీసెంట్ గా బన్నీ బర్త్ డే సందర్భంగా పుష్ప 2 టీజర్ ను విడుదల చేశారు. గంగమ్మ జాతర నేపథ్యంలో ఈ టీజర్ కట్ చేశారు దర్శకుడు సుకుమార్. ఈ టీజర్ లో ఎలాంటి డైలాగ్స్ పెట్టలేదు. కేవలం జాతర.. అల్లు అర్జున్ లుక్ మాత్రమే ఈ టీజర్ లో చూపించారు. ఈ టీజర్ లో అల్లు అర్జున్ నటవిశ్వరూపం చూపించాడు. మాతంగి గెటప్ లో అదరగొట్టాడు. పుష్ఫ 2 టీజర్ ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసింది.

సోషల్ మీడియాలో పుష్ప 2 టీజర్ సందడి చేస్తోంది. యూట్యూబ్ లో ఇప్పటికే ఈ టీజర్ మిలినస్ కొద్దీ వ్యూస్ ను సొంతం చేసుకుంది. పుష్ప 2 టీజర్ కేవలం 101 నిమిషాల్లోనే 500K లైక్స్ ను సొంతం చేసుకుని ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను షేర్ చేశారు. ఇక ఇప్పుడు 1 మిలియన్ లైక్స్ ను సొంతం చేసుకుంది ఈ టీజర్. దాంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. టీజర్ ఈ రేంజ్ లో ఉంటే ఇక సినిమా ఎలా ఉంటుందో అని మాట్లాడుకుంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్.

పుష్ప 2

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..