AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpaka Vimanam : దేవరకొండ బ్రదర్‌కు అండగా ఐకాన్ స్టార్.. ‘పుష్పక విమానం’కు బన్నీ సపోర్ట్..

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం "పుష్పక విమానం" రిలీజ్ కు రెడీ అవుతోంది.

Pushpaka Vimanam : దేవరకొండ బ్రదర్‌కు అండగా ఐకాన్ స్టార్.. 'పుష్పక విమానం'కు బన్నీ సపోర్ట్..
Rajeev Rayala
|

Updated on: Oct 28, 2021 | 6:58 PM

Share

Pushpaka Vimanam : యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం “పుష్పక విమానం” రిలీజ్ కు రెడీ అవుతోంది. నవంబర్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు “పుష్పక విమానం” చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చాయి. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఆంధ్రా, సీడెడ్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండగా, నైజాంలో గ్లోబల్ సినిమాస్ రిలీజ్ చేస్తోంది. ఓవర్సీస్ లో ఫ్రీజ్ ఫ్రేమ్ ఫిలింస్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.

ఫస్ట్ లుక్ నుంచి ఇప్పటిదాకా “పుష్పక విమానం” సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. రిలీజ్ చేసిన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ దక్కింది. సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఈ నెల 30న “పుష్పక విమానం” ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాబోతున్నారు. ఈ విషయాన్నీ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కు థాంక్స్ చెప్తూ ఓ పోస్ట్ న్బు షేర్ చేశారు.  ఇదిలా ఉంటే ఇటీవల విజయ్ దేవరకొండ “పుష్పక విమానం” సినిమాకు చేస్తున్న ప్రమోషన్ తో సినిమా ఆడియెన్స్ కు బాగా రీచ్ అవుతోంది. “పుష్పక విమానం” చిత్రాన్ని నూతన దర్శకుడు దామోదర తెరకెక్కించారు. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీ ని ‘కింగ్ అఫ్ ది హిల్’ ఎంటర్ టైన్మెంట్స్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి ,ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ketika Sharma: ఆ హీరోయిన్ అంటే తనకు చాలా ఇష్టమంటున్న ‘రొమాంటిక్’ బ్యూటీ.. ఆమె ఎవరంటే..

Peddanna: రజినీ మేనియానా మజాకా.. దూసుకుపోతున్న సూపర్ స్టార్ రజినీకాంత్ ‘పెద్దన్న’ ట్రైలర్ .

Aryan Khan Drugs Case: షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు ఎట్టకేలకు బెయిలు మంజూరు

Follow Us