Radisson Drugs Case: రాడిసన్ డ్రగ్ కేసులో ట్విస్ట్.. చెల్లి లిషిత కనిపించడం లేదని అక్క కుషిత ఫిర్యాదు..
తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. డ్రగ్స్ కేసులో ఉన్న లిషిత కనపడేటం లేదు అంటూ గచ్చిబౌలీ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆమె సొదరి హీరోయిన్ కుషిత. డ్రగ్స్ వార్తలు వచ్చినప్పటి నుండి తన చెల్లెలు కనపడటం లేదు అంటూ ఫిర్యాదులో పేర్కోంది. ఇప్పటికే లిషిత ఇంటికి నోటీసులు పంపించారు పోలీసులు. మరోవైపు లిషిత కావాలనే విచారణకు రావటం లేదు అంటున్నారు పోలీసులు. విచారణకు కచ్చితంగా రావాలని ఆమె కుటుంబ సభ్యులకు పోలీసులు చెప్పారు.

ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోన్న రాడిసన్ డ్రగ్స్ కేసు ఊహించని మలుపులు తిరుగుతుంది. ఇప్పటికే ఈ కేసులో ఏ 10 నిందితుడిగా డైరెక్టర్ క్రిష్ పేరును పోలీసులు చేర్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. డ్రగ్స్ కేసులో చిక్కుకున్న తన చెల్లెలు లిషిత కనపడేటం లేదు అంటూ గచ్చిబౌలీ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆమె సొదరి హీరోయిన్ కుషిత. డ్రగ్స్ వార్తలు వచ్చినప్పటి నుండి తన చెల్లెలు కనపడటం లేదు అంటూ ఫిర్యాదులో పేర్కోంది. ఇప్పటికే లిషిత ఇంటికి నోటీసులు పంపించారు పోలీసులు. మరోవైపు లిషిత కావాలనే విచారణకు రావటం లేదు అంటున్నారు పోలీసులు. విచారణకు కచ్చితంగా రావాలని ఆమె కుటుంబ సభ్యులకు పోలీసులు చెప్పారు.
రెండేళ్ల క్రితం హైదరాబాద్ రాడిసన్ హోటల్లో ఉన్న పబ్ లో జరిగిన సోదాల్లో పలువురు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల పిల్లలు.. వీఐపీ పిల్లల పేర్లు బయటకు వచ్చాయి. అప్పట్లో ఈ కేసు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఆ కేసులో ఇప్పటికీ కొందరిని విచారిస్తూనే ఉన్నారు. అదే సమయంలో నటి కుషిత కళ్లపు మీద కూడా డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. అయితే తాము కేవలం చీజ్ బజ్జిలు తినడానికి మాత్రమే వెళ్లామని.. డ్రగ్స్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. దీంతో అప్పట్లో కుషిత మాటలపై తెగ ట్రోల్స్ జరిగాయి. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో చిన్న చిన్న సినిమాల్లో నటిస్తు నటిగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది కుషిత.
మరోవైపు రాడిసన్ డ్రగ్ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. ఇప్పటికే ఏ10 నిందితుడిగా ఉన్న డైరెక్టర్ క్రిష్ అందుబాటులో లేడని.. అతడు పరారీలో ఉన్నాడంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు. ఆయన మీద సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేశామని తెలిపారు. రాడిసన్ హోటల్ కు వెళ్లానని.. ఆ రోజు అక్కడే ఉన్నానని.. కానీ డ్రగ్స్ మాత్రం తీసుకోలేదని క్రిష్ చెప్పినట్లు కథానాలు వచ్చిన సంగతి తెలిసిందే.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
