Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spirit Movie : ప్రభాస్ మూవీ స్టోరీ అదే.. హారర్ మాత్రం కాదు.. ‘స్పిరిట్’ స్టోరీ లైన్ చెప్పిన డైరెక్టర్ సందీప్ వంగా..

సెకండ్ పార్ట్ టైటిల్ 'యానిమల్ పార్క్' అంటూ ముందే టైటిల్ కూడా రివీల్ చేశారు. ఇక ఇందులోనూ రణబీర్, రష్మిక, త్రిప్తి, అనిల్ కపూర్ తోపాటు.. మరికొంత మంది బీటౌన్ నటులు కనిపించనున్నారని తెలుస్తోంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సందీప్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. సందీప్ నెక్ట్స్ ప్రాజెక్ట్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఉండనుంది. ఈ విషయాన్ని గతంలోనే ప్రకటించారు. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా టైటిల్ స్పిరిట్ అని వెల్లడించారు.

Spirit Movie : ప్రభాస్ మూవీ స్టోరీ అదే.. హారర్ మాత్రం కాదు.. 'స్పిరిట్' స్టోరీ లైన్ చెప్పిన డైరెక్టర్ సందీప్ వంగా..
Prabhas- Sandeep Reddy Vanga
Follow us
Rajitha Chanti

| Edited By: Basha Shek

Updated on: Apr 08, 2024 | 6:40 PM

యానిమల్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ తర్వాత మరోసారి ఆ రేంజ్ హిట్ అందుకున్నారు. పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రానికి భారీస్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దాదాపు రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. సెలబ్రెటీల నుంచి ‘యానిమల్’ మూవీపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చినప్పటికీ అడియన్స్ మాత్రం ఈ మూవీ సూపర్ హిట్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తీసుకురాబోతున్నారు డైరెక్టర్ వంగా. సెకండ్ పార్ట్ టైటిల్ ‘యానిమల్ పార్క్’ అంటూ ముందే టైటిల్ కూడా రివీల్ చేశారు. ఇక ఇందులోనూ రణబీర్, రష్మిక, త్రిప్తి, అనిల్ కపూర్ తోపాటు.. మరికొంత మంది బీటౌన్ నటులు కనిపించనున్నారని తెలుస్తోంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సందీప్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

సందీప్ నెక్ట్స్ ప్రాజెక్ట్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఉండనుంది. ఈ విషయాన్ని గతంలోనే ప్రకటించారు. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా టైటిల్ స్పిరిట్ అని వెల్లడించారు. అయితే ఈ సినిమా గురించి కొద్ది రోజులుగా నెట్టింట చర్చ జరుగుతుంది. స్పిరిట్ మూవీ హారర్ నేపథ్యంలో రాబోతుందని ప్రచారం నడుస్తుంది. తాజాగా ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు సందీప్. దుకాణ్ అనే హిందీ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు అతిథిగా వెళ్లిన సందీప్ అక్కడి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మీ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పాలని అడగ్గా.. స్పిరిట్, యానిమర్ పార్క్ గురించి కొన్ని విషయాలను బయటపెట్టారు.

సందీప్ మాట్లాడుతూ.. “ప్రస్తుతం నేను ప్రభాస్ తో చేయనున్న సినిమా పనుల్లో బిజీగా ఉన్నాను. అందరూ అనుకుంటున్నట్లు ఇది హారర్ స్టోరీ కాదు. నిజాయితీ కలిగిన ఓ పోలీస్ ఆఫీసర్ కథ. ప్రస్తుత ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆ తర్వాత యానిమల్ పార్క్ చిత్రాన్ని రూపొందిస్తాను. ప్రస్తుతానికి ఈ అప్డేట్ మాత్రమే ఇవ్వగలను ” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో స్పిరిట్ మూవీపై మరింత క్యూరియాసిటీ నెలకొంది. ఇందులో ప్రభాస్ తొలిసారి ఖాకీ దుస్తులు ధరించి.. లాఠీ పట్టుకుని కనిపించనున్నారు. గతంలో ఈ మూవీ నిర్మాత మాట్లాడుతూ.. ఇదివరకు ఎన్నడూ చూడని పాత్రలో ప్రభాస్ చూస్తారని చెప్పడంతో స్పిరిట్ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ కథ అని తెలియడంతో స్పిరిట్ మూవీ పై యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.

ఈ సినిమాకు హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం అందించనున్నారు. ఎనిమిది భాషల్లో ఈసినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే.. ఇటీవలే సలార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రభాస్.. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 AD చిత్రంలో నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది మే 9న రిలీజ్ చేయనున్నారు. అలాగే మారుతీ డైరెక్షన్లో రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్నారు.