Hrithik Roshan: మాజీ ప్రియురాలికి అండగా హృతిక్‌రోషన్.. అసలు ఈ స్టార్ హీరో ఏం చేశాడంటే..

మాజీ ప్రియురాలికి హృతిక్ రోషన్ ఎందుకు సపోర్ట్ చేశారు. ? మూవీస్ కంటే వివాదాలతోనే పేరు తెచ్చుకున్న హీరోయిన్ కంగనా రనౌత్ మరోసారి చర్చనీయాంశంగా మారారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన కంగనా రనౌత్‌.. ఆ తర్వాత రోజే చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. సీఐఎస్ఎఫ్ మహిళా అధికారి కుల్వీందర్ కౌర్.. కంగనా చెంప చెళ్లుమనిపించడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది.

Hrithik Roshan: మాజీ ప్రియురాలికి అండగా హృతిక్‌రోషన్.. అసలు ఈ స్టార్ హీరో ఏం చేశాడంటే..
Kangana Ranaut, Hrithik Ros
Follow us

|

Updated on: Jun 10, 2024 | 12:19 PM

చెంపదెబ్బ వివాదంలో కంగనా రనౌత్‌కు బాలీవుడ్ హీరో హృతిక్‌రోషన్ సపోర్ట్‌ చేయడం ఆసక్తిగా మారింది. ఇంతకీ.. కంగనా రనౌత్‌ విషయంలో హృతిక్‌రోషన్ చేసిన కామెంట్స్ ఏంటి.? మాజీ ప్రియురాలికి హృతిక్ రోషన్ ఎందుకు సపోర్ట్ చేశారు. ? మూవీస్ కంటే వివాదాలతోనే పేరు తెచ్చుకున్న హీరోయిన్ కంగనా రనౌత్ మరోసారి చర్చనీయాంశంగా మారారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన కంగనా రనౌత్‌.. ఆ తర్వాత రోజే చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. సీఐఎస్ఎఫ్ మహిళా అధికారి కుల్వీందర్ కౌర్.. కంగనా చెంప చెళ్లుమనిపించడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. దీనికి సంబంధించి భిన్నాబిప్రాయాలు వ్యక్తవుతున్నాయి. కొందరు కుల్వీందర్ కౌర్‌కి సపోర్ట్‌ చేస్తుండగా.. బాలీవుడ్ సెలబ్రిటీలు కంగనకు అండగా నిలుస్తున్నారు.

ఈ క్రమంలోనే.. తాజాగా మహిళా కానిస్టేబుల్‌కి వ్యతిరేకంగా పెట్టిన ఓ సోషల్ మీడియా పోస్ట్‌కి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ లైక్ కొట్టడం చర్చకు దారి తీసింది. గతంలో కంగన- హృతిక్ మధ్య ప్రేమాయణం సాగగా.. పరిస్థితులు అనుకూలించక విడిపోయారు. మధ్యలో పోలీస్ కేసుల వరకు వెళ్లారు. కానీ.. సడెన్‌గా ఇప్పుడు కంగనాకి హృతిక్ పరోక్షంగా సపోర్ట్ చేయడం బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇదిలావుంటే.. పంజాబ్ రైతుల నిరసనలపై కంగన రనౌత్‌ వ్యాఖ్యలకు భగ్గుమన్న కుల్వీందర్ కౌర్.. ఆమెపై చేయి చేసుకున్నారు.

చండీగఢ్ ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ చెక్ తర్వాత బోర్డింగ్ పాయింట్ వైపు వెళ్లబోతున్న కంగనపై మహిళా కానిస్టేబుల్ చేయిచేసుకున్నారు. దాంతో.. ఆమెపై సస్పెన్షన్ వేటు పడింది. అటు.. ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్న వెంటనే కంగన.. మహిళా కానిస్టేబుల్‌పై ఫిర్యాదు చేశారు. అయితే.. రైతులు 100 రూపాయలు తీసుకుని నిరసనల్లో పాల్గొన్నారని కంగన కామెంట్స్‌ చేయడం ఏంటని ప్రశ్నించిన కుల్విందర్ కౌర్.. ఆ నిరసనల్లో తన తల్లి కూడా పాల్గొన్నారని గుర్తు చేశారు. ఏదేమైనా.. కొందరు కంగనకు సపోర్ట్‌ చేస్తుంటే.. మరికొందరు మాత్రం కుల్వీందర్ కౌర్‌కు అండగా నిలుస్తుండడం ఆసక్తిగా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్